ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో అగ్గి రాజేసింది కృతి సనోన్. 1నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత దోచేయ్ అనే చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అటుపై పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అక్కడ ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉంది అమ్మడు. ఇటీవలే `లుక్కా చుప్పీ` అనే సినిమాతో విజయం అందుకుంది. యావరేజ్ సినిమా అంటూ క్రిటిక్స్ తీసి పారేసినా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు దక్కాయని రిపోర్ట్ అందింది.
ఈ వేడి తగ్గకముందే మరో రకంగానూ వేడి పెంచే పనిలో ఉంది కృతి. ఈ అమ్మడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ `కళాంక్`లో ఓ ఐటెమ్ నంబర్ లో నటించింది. ఐరా గైరా .. అంటూ సాగే ఈ పాటను ఈ ఆదివారం నాడు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సాంగ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో కృతి మైండ్ బ్లోవింగ్ ఎక్స్ ప్రెషన్ అభిమానుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. కనుబొమ్మల్ని ఎగురవేస్తూ కనుపాపలతోనే కోటి భావాలు పలికించింది కృతి. పైగా బ్యాక్ లెస్ డిజైనర్ డ్రెస్ లో మతి చెడగొట్టింది. ఒక చిన్న బిట్ సాంగ్ లోనే ఇంత చేసి చూపించింది.. పూర్తి పాటలో ఇంకెన్ని భావాలు పలికిస్తుందో అంటూ యూత్ అదే పనిగా మాట్లాడుకుంటున్నారు. కృతికి ఉత్తరాదిన ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. ఆ క్రమంలోనే తన ప్రతి యాక్టివిటీని జనం సోషల్ మీడియాలో క్యాచ్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రిన - కరీనా రేంజులో ఐటెమ్ నంబర్లతో దూకుడు చూపించిన భామలెవరూ లేరు. ఆ తర్వాత కృతి సనోన్ ఆ బ్లాంక్ స్పేస్ ని ఫిల్ చేస్తుందేమో చూడాలి. ఒకవేళ ఐటెమ్ లతో కనెక్టయితే తిరిగి టాలీవుడ్ లోనూ అడుగుపెట్టే ఛాన్సుంటుందేమో! కాస్త వేచి చూస్తే అన్నిటికీ క్లారిటీ వచ్చేస్తుంది. వరుణ్ ధావన్, ఆలియాభట్, ఆదిత్యా రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, మాధురి ధీక్షిత్ లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజవుతోంది.