క‌ళ్యాణ్ దేవ్..అశోక్ గ‌ల్లా ఎక్క‌డా ప‌త్తా లేరే!

Update: 2022-09-13 03:30 GMT
మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా టాలీవుడ్ నుంచి ఏ రేంజ్ లో ప‌రిచ‌యం అయ్యారో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌ళ్యాణ్ కి మెగా బ్రాండింగ్ తో....అశోక్ సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డిగా లాంచ్ అయ్యారు. ఆ హీరోలిద్ద‌రి ఎంట్రీ ముందు ప్ర‌చారం భారీగానే జ‌రిగింది. క‌ళ్యాణ్ దేవ్ 'విజేత‌' సినిమాకు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసి రిలీజ్ చేసారు.

ఆ సినిమా ప్రారంభం నుంచి ముగింపు..అటుపై రిలీజ్ స‌మ‌యంలో మెగా హ‌డావుడి అంతా మామూలుగా సాగలేదు. ఆ సినిమా యావ‌రేజ్ గా ఆడింది.  అటుపై  సూప‌ర్ మ‌చ్చి..కిన్నెర సాని అంటూ మ‌రో రెండు సినిమాలు చేసాడు. కానీ వీటి ప్ర‌చారంలో మెగా ఇమేజ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రిలీజ్ అయ్యాయి..వెళ్లాయి త‌ప్ప‌! వాటి గురించి పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు కూడా తెలియ‌దు.

కంటెంట్ వైఫ‌ల్యంతోనే వాటికంత రీచ్ లేద‌ని తెలుస్తోంది. ఇక అశోక్ ఎంట్రీ విష‌యంలో కొన్ని స‌వాళ్లు ఎదురైన సంగ‌తి తెలిసిందే. బ్యాక‌ప్ ఉన్నా క‌థ..ద‌ర్శ‌కుడి విష‌యంలో త‌డ‌బాటు జ‌రిగింది. ఆ ర‌కంగా ఆశోక్ ఆరంభంలో కొంత డిస్ట‌బెన్స్ కి గుర‌య్యాడు. చివ‌ర‌కు ఎలాగూ  ఇదే ఏడాది హీరో అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవ‌డంతో అశోక్ కి అంత రీచ్ దొర‌క‌లేదు.

మ‌రి ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు ఏం?  చేస్తున్నారంటే? ఎక్క‌డా ప‌త్తా కూడా క‌నిపించ‌లేదని మీడియా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. సినిమాలు రిలీజ్ అయి నెల‌లు గ‌డుస్తున్నాయి. ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లేదు.

బ్యాక‌ప్ లేని కొంద‌రు హీరోలు ముందుకు దూసుకుపోతుంటే అన్ని ర‌కాల స‌పోర్ట్ ఉన్న ఇద్ద‌రు హీరోలు మాత్రం వెనుకంజ‌లోనే క‌నిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాకి  కూడా ఇద్ద‌రు హీరోలు దూరంగానే ఉన్న‌ట్లున్నారు.

ఎలాంటి మేకోవ‌ర్ ఫోటో షూట్ లో కనిపించింది లేదు. నెట్టింట ఏ మాత్రం ప్ర‌చారం కూడా లేదు. మ‌రి నేటి సోషల్ మీడియా జ‌మానాలో ఇలా వెనుక‌బ‌డితే క‌ష్టం అనేస్తున్నారు నెటి జ‌నులు. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా? క‌నీసం దొరికిన మాధ్య‌మాల ద్వారానైనా ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటే? అదో అనందమే క‌దా అంటున్నారు. మ‌రి హీరోలిద్ద‌రు సీక్రెట్ గా  పెద్ద బాంబ్ పేల్చే ప్లాన్ లో  ఉన్నారా? అన్న సందేహం రాక మాన‌దు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News