ఎంత లక్ ఉన్నా కానీ అప్పుడప్పుడు టైమింగ్ పాటించకపోతే మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి.. దానికి ఉదాహరణే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ..ఇటీవలే రవితేజతో కలిసి నేల టిక్కెట్టు అనే సినిమా తీశాడు. అంతకుముందు వరుస హిట్స్ కొట్టిన కళ్యాణ్ కృష్ణకు నేల టిక్కెట్టు షాక్ ఇచ్చింది. రవితేజతో సినిమా తీస్తున్న సమయంలో ఆ బిజీలో పడి తనకు వచ్చిన ఓ మంచి ప్రాజెక్టును వదులుకున్నాడు.
వెంకటేశ్-నాగచైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మించాలని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు ముందుగా దర్శకుడు కళ్యాన్ కృష్ణనే అనుకున్నారు. రవితేజతో నేలటిక్కెట్ తీస్తున్న సమయంలోనే కళ్యాణ్ కృష్ణ ను సంప్రదించారట.. కానీ కాల్షీట్ల సమస్యతో ఈ అద్భుత ఆఫర్ ను వదులుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాత - సమర్పకులు విశ్వప్రసాద్ - వివేక్ - రచయిత కోనవెంకట్ లు వేరే దర్శకుడిని ఓకే చేశారు.
ఎన్టీఆర్ తో జైలవకుశ తీసి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ ఆ సినిమా తర్వాత ఖాళీగా ఉంటున్నాడు. దీంతో సురేష్ బాబు.. బాబీని సంప్రదించడం.. సినిమాకు ఓకే అనడం జరిగిపోయారు. ఈనెల 11న ముహూర్తం నిర్ణయించారు. వెంకీమామ అన్నది సినిమా టైటిల్.
ఈ సినిమాలో వెంకటేశ్-నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం వెంకీ ఎఫ్2 మూవీ తీస్తుండగా.. చైతన్య రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తయ్యాక కొత్త చిత్రం ‘వెంకీమామ’ సెట్స్ పైకి వెళ్లనుంది.