కళ్యాణ్‌ రామ్‌ మూవీకి టేబుల్‌ ప్రాఫిట్‌

Update: 2019-02-27 14:27 GMT
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈమద్య కాలంలో చేసిన ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్‌ సక్సెస్‌ లను అందుకోలేక పోయాయి. పటాస్‌ చిత్రం తర్వాత వరుసగా ఫ్లాప్‌ లే ఈయనకు దక్కాయి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడి టైప్‌ లో సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ఈయన గుహన్‌ దర్శకత్వంలో '118' చిత్రాన్ని చేయడం జరిగింది. తన గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ విషయంలో దర్శకుడిని మరియు నిర్మాతలను కళ్యాణ్‌ రామ్‌ కాస్త అదుపులో ఉంచినట్లుగా తెలుస్తోంది. కాస్త అటు ఇటుగా ఈ చిత్రం 10 కోట్ల బడ్జెట్‌ తో పూర్తి అయ్యిందట. తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కడంతో పాటు, ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఆ కారణంగా ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్‌ ఫ్రాఫిట్‌ ను తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం '118' చిత్రం నైజాం, ఆంధ్రా, సీడెడ్‌ కలిపి ఆరు కోట్ల బిజినెస్‌ చేసిందట. ఇక హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలో ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయట. విడుదలకు ముందే జెమిని టీవీ శాటిలైట్‌ రైట్స్‌ ను మూడు కోట్లకు పైగా పెట్టి దక్కించుకుందట. ఆడియో రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ ద్వారా మరో కోటి రూపాయల వరకు నిర్మాతల ఖాతాలో వచ్చి చేరినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ చిత్రం 14 కోట్ల బిజినెస్‌ ను చేసి ఉంటుందని, దాంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 4 కోట్ల మేరకు లాభాలు వచ్చి ఉంటాయనే టాక్‌ వినిపిస్తుంది.

కళ్యాణ్‌ రామ్‌ మూవీకి ఈస్థాయి లాభాలు రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తక్కువ బడ్జెట్‌ మూవీ అవ్వడంతో ఇలా విడుదలకు ముందే లాభాలు వచ్చాయని టాక్‌ వినిపిస్తుంది. కళ్యాణ్‌ రామ్‌ కు జోడీగా ఈ చిత్రంలో నివేదా థామస్‌ మరియు షాలిని పాండేలు నటించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కూడా నిర్మాతలకు మరింత లాభాలు ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News