ఇంటరెస్టింగ్ స్టోరీ లైన్ తో కళ్యాణ్ రామ్ మూవీ.. క్రేజీ అప్డేట్!

Update: 2021-05-26 12:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ప్లాప్ మూవీస్ ఎదుర్కొంటున్న హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. గతంలో పటాస్, 118 సినిమాలతో హిట్స్ అందుకున్న కళ్యాణ్ రామ్.. తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వచ్చాయి. చివరిగా నటించిన 'ఎంతమంచి వాడవురా' సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తున్నాడు. లాక్డౌన్ లో కొంతమంది దర్శకుల కథలను విన్నాడట. ఇకపై తదుపరి సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ జాగ్రత్తపడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ స్టోరీని ఓకే చేసాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు ద్విపాత్రభినయం చేసాడు కానీ త్రిపాత్రభినయం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండేళ్ల కిందటే కళ్యాణ్ రామ్ మరో డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కథను ఓకే చేసాడు. 2019లో ఓకే చేసిన ఈ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. వశిష్ట్ చెప్పిన స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉందని.. కేవలం సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయిందని సమాచారం. అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో టైం ట్రావెల్ గురించి రూపొందనుంది. తాజాగా మేకర్స్ సినిమాను అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ మే 28న టైటిల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన తుగ్లక్ రాజవంశం నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుందని.. ఆ విధంగా కళ్యాణ్ రామ్ ఆ కాలానికి వెళ్లి ఢిల్లీ సుల్తాన్ గా జన్మిస్తాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో కళ్యాణ్ రామ్ చాలా ఆసక్తిగా ఉన్నాడట. సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి సినిమాకు భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. అందుకే వేరే నిర్మాతలతో రిస్క్ ఎందుకని స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. ఇది కళ్యాణ్ రామ్ 18వ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ డైరెక్టర్ శ్రీవాస్ కథను కూడా ఓకే చేసాడట. అయితే హీరోగా చేస్తూనే కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ - కొరటాల సినిమాను నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News