మ‌హేష్‌ తో త‌మ్ముడు.. భ‌ర‌త్‌ తో అన్న‌

Update: 2018-04-18 10:48 GMT
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ర‌చ్చే జ‌రుగుతుంది. టీవీ ఆన్ చేస్తే చాలు నిత్యం ఆ ఇష్యూ మీదే చ‌ర్చ‌లు. వాటిని కాస్త ప‌క్క‌న పెడితే ఎన్నో మంచి మార్పులు కూడా జరుగుతున్నాయి. ఏ ఇండ‌స్ట్రీలో అయినా హీరోల మ‌ధ్య పోటీ సాధార‌ణంగా ఉంటుంది. కానీ తెలుగు ఇండ‌స్ట్రీలో ఆ పోటీ  స్నేహ‌పూర్వ‌కంగా మారుతోంది. హీరోలు హీరోలు స్నేహితులై పోతున్నారు. ఒక‌రి ఆడియో ఫంక్ష‌న్ల‌కు మ‌రొక‌రు వెళ్ల‌డం సినిమాకు మ‌ద్ద‌తు చెప్ప‌డం చేస్తున్నారు. ప్రిన్స్ మ‌హేష్‌కు నంద‌మూరి హీరోల‌కు బాగానే స్నేహం కుద‌రింది.

పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తీసిని సినిమా భ‌రత్ అను నేను. ఏప్రిల్ 20 ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈలోపు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా ఊపందుకున్నాయి. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 7న హైద‌రాబాద్‌లోజ‌రిగింది. ఈ ఈవెంట్ కు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా పాల్గొని అంద‌రిలో ఉత్సాహాన్ని నింపాడు. ఒక స్టార్ హీరో సినిమా వేడుక‌కు మ‌రో స్టార్ హీరో రావ‌డం గొప్పే క‌దా. జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్న క‌ళ్యాణ్ రామ్ కూడా త‌న సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. అత‌ను ప్ర‌స్తుతం నా నువ్వే అనే రొమాంటిక్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్‌. ఈ చిత్ర ట్రైల‌ర్‌ ను భ‌ర‌త్ సినిమా ప్ర‌ద‌ర్శించే ధియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించింది ఆ చిత్ర యూనిట్‌. భ‌ర‌త్ అను నేను సినిమా మొద‌ల‌వ‌డానికి ముందో...లేక మ‌ధ్య‌లోనో ఈ ట్రైల‌ర్ ను వేస్తార‌న్న మాట‌.

భ‌ర‌త్ అను నేను సినిమా ప్రి రిలీజ్ వేడుక‌కు త‌మ్ముడు ఎన్టీఆర్ వెళితే భ‌రత్ సినిమాను అన్న క‌ళ్యాణ్ రామ్ త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం వాడేసుకుంటాడ‌న్న మాట‌. నా నువ్వే సినిమా మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మ‌న్నా క‌ళ్యాణ్ రామ్ తో తొలిసారి న‌టిస్తోంది.


Tags:    

Similar News