తమ్ముడు ‘లెజెండ్’ కాదన్న కళ్యాణ్ రామ్

Update: 2017-05-28 05:52 GMT
తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ను ‘లెజెండ్’ అని అభిమానులు సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. తన తమ్ముడు ఎప్పటికీ ‘లెజెండ్’ కాలేడని.. అది పెద్దవాళ్లకు వాడాల్సిన పదమని అన్నాడు కళ్యాణ్ రామ్. ‘లెజెండ్’ అనే పదం తమ తాత నందమూరి తారకరామారావు మాత్రమే లెజెండ్ అని.. ఆయన గురించి మాట్లాడేటపుడు మాత్రమే ఆ పదాన్ని వాడాలని అభిమానులకు సూచించాడతను. తానా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ పేరిట అవార్డు అందుకోవడం కోసం కళ్యాణ్ రామ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ స్థానిక తెలుగు సంఘాలు.. అభిమానులు కలిసి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటూ అభిమానులు అడగ్గా.. కాస్త ఆలోచించి ‘ఆటంబాంబు’ అన్నాడు కళ్యాణ్ రామ్. ఆ సందర్భంగా ఓ అభిమాని ‘లెజెండ్’ అని అరవగా.. అభ్యంతరం వ్యక్తం చేశాడు కళ్యాణ్ రామ్. నందమూరి మోక్షజ్న అరంగేట్రం గురించి చెప్పమని కళ్యాణ్ రామ్ ను అడిగితే.. ‘‘అది నాకంటే బాబాయి చెబితే బాగుంటుంది. పుత్రోత్సాహం ఉంటుంది కదా’’ అని బదులిచ్చాడు. బాలయ్యతో సినిమా గురించి అడగ్గా.. ‘‘మంచి కథ దొరికితే తప్పకుండా బాబాయితో కలిసి నటిస్తా. అందుకు అభ్యంతరమేమీ లేదు. కానీ ఏ సినిమా అయినా నా మనసుకు నచ్చాలి. సినిమా హిట్టవచ్చు.. ఫ్లాప్ కావచ్చు. కానీ మనసుకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. పిల్లలతో ఆడుకుంటా’’ అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News