భారీ చిత్రాల దర్శకుడు శంకర్ - విశ్వ నటుడు కమల్ హాసన్ ల కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'భారతీయుడు'. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులవర్షాన్ని కురిపిస్తాయి కానీ వాటిలో అతికొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకులకు సమాజం పట్ల మన భాద్యత ఇదీ అంటూ గుర్తు చేస్తాయి.. మనసుల్ని తాకుతాయి. రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అలాంటి చిత్రాలలో ఒకటి.
వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కమల్ అవినీతిపై చేసే పోరాటం - కేరళ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అన్నీ కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా 'భారతీయుడు-2' ని తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కమల్ కూడా ఈ సినిమా తన ఫ్యూచర్ ప్రాజెక్టులలో ఒకటని కొన్ని నెలల క్రితం చెప్పారు. కానీ తాజా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ పూర్తి స్థాయి హీరో కాదట. కమల్ పాత్ర ఈ సినిమాలో ఉన్నప్పటికీ అవినీతిపై పోరాటం చేసేది మరో హీరోనట.. ఆ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యే ఒక హీరో కోసం శంకర్ ఇప్పటికే వెదకడం ప్రారంభించాడట.
దీంతో ఆ హీరో ఎవరా అంటూ కోలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. శంకర్ ప్రస్తుతం రజనీకాంత్ '2.0' సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. నవంబర్ లో రజని సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి భారతీయుడు సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఏదేమైనా కమల్ హాసన్ నటవిశ్వరూపాన్ని మరోసారి చూద్దామనుకున్న అభిమనులకు అయన తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తాడన్న వార్త కాస్త నిరాశ కలిగించేదే.