క‌మ‌ల్ కుమార్తెను కిడ్నాప్ చేయ‌బోయార‌ట‌

Update: 2017-08-14 08:05 GMT
ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్న విశ్వ క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఓ సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. త‌న 40 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో త‌న‌కు న‌చ్చిన సినిమాల గురించి ప్ర‌త్యేకంగా ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. క‌మ‌ల్ కెరీర్ లో విల‌క్ష‌ణ చిత్రంగా.. విశేషంగా ఆక‌ట్టుకున్న మ‌హాన‌ది చిత్రానికి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని ఆయ‌న చెప్పారు. మ‌హాన‌ది సినిమా క‌థ‌కు స్ఫూర్తి వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎదురైన ఒక అనుభ‌వ‌మేన‌ని క‌మ‌ల్ వెల్ల‌డించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ తాను ఈ విష‌యాన్ని ఎక్క‌డా చెప్ప‌లేద‌న్న క‌మ‌ల్‌.. త‌న కుమార్తెను కిడ్నాప్ చేయ‌బోయిన ఉదంతంతోనే మ‌హాన‌ది క‌థ‌ను రాసుకున్న‌ట్లుగా పేర్కొన్నారు.

1994లో వ‌చ్చిన మ‌హాన‌ది చిత్రం క‌మ‌ల్ సినిమాల్లో ఒక ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని చెప్పాలి. అప్ప‌ట్లో దేశంలో మొద‌లైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా మారిన స‌మాజ ముఖ‌చిత్రం.. ప్ర‌జ‌ల్లో అప్పుడ‌ప్పుడే మొద‌ల‌వుతున్న వినిమ‌య‌త‌త్త్వం లాంటి అంశాల‌తొ పాటు.. స‌మాజంలోనూ.. మ‌నుషుల మ‌న‌సుల్లో వ‌చ్చిన మార్పు ఈ చిత్రంలో అంత‌ర్లీనంగా స్పృశించ‌టం క‌నిపిస్తుంది. ఇక‌..మ‌హాన‌ది సినిమా క‌థ‌కు జ‌రిగిన‌రియ‌ల్ ఘ‌ట‌న గురించి క‌మ‌ల్ చెబుతూ.. ఒక కొత్త క‌థాంశాన్ని త‌న త‌ర్వాతి సినిమాకు చేయాల‌న్న ఉద్దేష‌శంతో దాదాపు నెల రోజు ప్ర‌య‌త్నించాన‌ని..కానీ చేయ‌లేక‌పోయాన‌ని చెప్పారు.

"స‌రిగ్గా అప్ప‌డే మా ఇంట్లో ప‌ని వాళ్లు మా అమ్మాయిని కిడ్నాప్ చేయాల‌నుకున్నారు. అందుకు రెక్కీ కూడా నిర్వ‌హించారు. డ‌బ్బు కోసం వాళ్లు ఆ ప‌ని చేయ‌బోయారు. వారు త‌మ ప‌ధ‌కాన్ని అమ‌లు చేసే వేళ‌లో నాకీ విష‌యం తెలిసింది. వాళ్ల‌ను చంపేయాల‌న్నంత కోపం వ‌చ్చింది. కానీ.. ఆవేశం కంటే ఆలోచ‌న ముఖ్యం అనిపించింది. అదే స‌మ‌యంలో నాకు ఎదురైన అనుభ‌వంతో మ‌హాన‌ది క‌థ రాశా. ఎప్పుడైతే నా కూతురి విష‌యంలో నాకు భ‌యం క‌లిగిందో.. అదే విష‌యాన్ని అంద‌రికి చెప్పాల‌నుకునే మ‌హానది సినిమా తీశా. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. కానీ ఇప్పుడైతే నేను ప్ర‌పంచాన్ని ఎలా అర్థం చేసుకున్నానో.. పెద్దవాళ్లు అయిన నా కూతుళ్లు కూడా అలాగే అర్థం చేసుకుంటార‌న్న న‌మ్మ‌కం ఉంది. అందుకే చెబుతున్నా" అని మ‌హాన‌ది క‌థ వెనుక అస‌లు క‌థ‌ను చెప్పుకొచ్చారు క‌మ‌ల్‌.
Tags:    

Similar News