చిత్రపరిశ్రమలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నా.. ఆర్థికంగా అంత బలోపేతం కాని అగ్రహీరోలు ఎవరైనా ఉన్నారా? అంటే.. టక్కున లోకనాయకుడు కమల్ హాసన్ గుర్తుకు వస్తారు. సినిమా మీద తనకున్నప్రేమను ఆయన తరచూ ప్రదర్శిస్తుంటారు. కొన్ని చిత్రాలకు తానే నిర్మాతగా మారి రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న రిస్క్ లతో ఆయన ఆర్థికంగా మరిన్ని సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
భారీ ప్రాజెక్టులను స్టార్ట్ చేసి.. వాటితో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక పక్కన పెట్టేసిన తన పెండింగ్ ప్రాజెక్టులను కమల్ హాసన్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్లుంది. నాలుగేళ్లుగా అతీగతీ లేకుండా పడి ఉన్న విశ్వరూపం2ను ఈ ఏడాది ఎలాగైనా విడుదల చేయాలన్న పట్టుదలతో కమల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన కలల ప్రాజెక్టు అయిన మరుదనాయగంను ఆయన బయటకు తీయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు రెండు దశాబ్దాల కిందట బ్రిటీష్ రాణి ఎలిజబెత్ చేతుల మీద స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆ సినిమా ఆగినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సినిమాను తీద్దామని ప్రయత్నించినా.. భయపెట్టే బడ్జెట్ కారణంగా ఎవరూ సాహసించలేకపోయారు అలాంటి ఈ సినిమాను తాజా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా బయటకు తీయటం విశేషం.
పూర్తి గడ్డంతో ఉన్న ఈ సినిమా స్టిల్స్ కమల్ అభిమానుల్ని ఆనందానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమాకు తయారు చేయించిన కొత్త పోస్టర్లు కేన్స్ లో పెట్టటం.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 40 నిమిషాల నిడివి కమల్ దగ్గర ఉన్నట్లు చెబుతారు.
ఈ మొత్తం అవుట్ పుట్ ను ఉన్నది ఉన్నట్లుగా వాడేసి.. మిగిలిన సినిమాను ఏదోలా పూర్తి చేయాలన్న పట్టుదలతో కమల్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకు అవసరమైన ఫైనాన్స్ కోసమే కేన్స్ స్టాండ్ లో మురుదునాయగం పోస్టర్ ను పెట్టినట్లుగా సమాచారం. మరి.. పోస్టర్ తో ఆకర్షించొచ్చన్న ప్లాన్ వర్క్ వుట్ అవుతుందా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/