తమిళ బిగ్​బాస్ హౌస్​లో శ్రీశ్రీ కవిత!

Update: 2020-11-16 12:10 GMT
బిగ్​బాస్​ హౌస్​ అంటేనే జనాలకు విరక్తి వచ్చేసింది. ప్రారంభంలో ఈ షో అంటే కొంత ఆసక్తి ఉండేది. కానీ ఎంపిక చేస్తున్న సభ్యులు, వారి ప్రవర్తనతీరుతో రోజురోజుకూ ఈ షో పట్ల ప్రజలకు వెగటు పుట్టింది. మిగతా భాషల విషయం తెలియదు కానీ తెలుగులో మాత్రం ఈ సీజన్​లో బిగ్​బాస్​ పట్ల ఆసక్తి పూర్తిగా పోయింది. కరోనా లాక్​డౌన్​తో జనాలంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి విపరీతంగా రేటింగ్​లు పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. ప్రారంభంలో ప్రేక్షకుల్లో కూడా కొంత ఆసక్తి ఉండేది. కాని రాను రానూ బిగ్​బాస్​ ఇస్తున్న టాస్కులు, సభ్యుల ప్రవర్తన చూసి జనాలకు బోర్​ కొట్టింది.

ఈ సారి బిగ్​బాస్​ హౌస్​ నిర్వాహకులు ఏ మాత్రం కసరత్తు చేయకుండా టాస్కులు పెట్టడమే అందుకు కారణం. కేవలం శని, ఆదివారాల్లో మాత్రం బిగ్​బాస్​కు కొంతమేర రేటింగ్​ కనిపిస్తుంది. అయితే తమిళనాడు బిగ్​బాస్​కు మాత్రం ఓ రేంజ్​ క్రేజ్​ ఉన్నది. అక్కడ హోస్టింగ్​ చేస్తున్నది మహానటుడు కమల్​హాసన్​ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
క‌మ‌ల్ హాస‌న్ అక్కడ బాగానే రాణిస్తున్నారు. తమిళనాడులోనూ బిగ్​బాస్​ హౌస్​లో అనామకులను ఇంటి సభ్యులుగా తెచ్చిపెట్టారు. అయినప్పటికీ కమల్​హాసన్​ షోను కొంతమేర రక్తి కట్టిస్తున్నాడు. అయితే తాజాగా కమల్​హాసన్​ అక్కడి బిగ్​బాస్​ హౌస్​లో మహాకవి శ్రీశ్రీ కవితను చదివి వినిపించారు. ఈ శతాబ్ధం నాది అని ప్రకటించిన ఓ యుగకవిని తెలుగు ప్రేక్షకులు, సినిమావాళ్లు, ప్రభుత్వాలు విస్మరించిన వేళ.. ఓ తమిళ నటుడు స్పందించడం.. శ్రీశ్రీ పేరును బిగ్​బాస్​ హౌస్​లో ప్రస్తావించడం.. శ్రీశ్రీ కవితను వినిపించడం నిజంగా తెలుగువాళ్లకు గర్వకారణం.

మ‌హాక‌వి శ్రీశ్రీ మ‌హాప్ర‌స్థానంలో భాగ‌మైన 'ప‌తితురాల భ్ర‌ష్టులారా..' అనే క‌విత‌ను క‌మ‌ల్ బిగ్​బాస్​ హౌస్​లో వినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.త‌మిళంలో భార‌తియ‌ర్ లాగే తెలుగులో మ‌హాక‌వి శ్రీశ్రీ అని క‌మ‌ల్ పోలిక పెట్టారు. మ‌హాప్ర‌స్థానాన్ని కీర్తిస్తూ క‌మ‌ల్ ఒక క‌విత అల‌వోక‌గా చెప్పారు. తెలుగును సుంద‌ర తెలుంగు అని భార‌తియ‌ర్ కీర్తించిన వైనాన్ని కూడా క‌మ‌ల్ ప్ర‌స్తావించారు. క‌మ‌ల్ న‌టించిన ప‌లు సినిమాల్లో శ్రీశ్రీ ప్ర‌స్తావ‌న ఉంటుంది. ఆక‌లిరాజ్యం త‌మిళ వెర్ష‌న్ లో సుబ్ర‌మ‌ణ్య భార‌తి క‌విత‌ల‌ను వ‌ల్లెవేస్తూ ఉంటాడు హీరో. అదే సినిమా తెలుగు వెర్ష‌న్లో మ‌హాక‌వి శ్రీశ్రీ క‌విత‌ల‌ను సంద‌ర్భానుసారం ఉప‌యోగించారు. అలాగే మ‌హాన‌ది సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్లో శ్రీశ్రీ క‌విత‌లు వినిపిస్తాయి. ఇంద్రుడు చంద్రుడులో క్లైమాక్స్ లో శ్రీశ్రీ క‌విత‌లు చెబుతాడు క‌మ‌ల్. అయితే మహాకవి శ్రీశ్రీని తెలుగు సినిమావాళ్లు గుర్తుచేసుకోవడం చాలా తక్కువ. అటువంటి ఓ తమిళనటుడు శ్రీశ్రీ కవితలను ప్రస్తావించడం గొప్పవిషయం.


Tags:    

Similar News