కమల్ హాసన్ ఎవ్వరికీ భయపడే రకం కాదు. సినిమాల్లో అయినా.. బయట అయినా తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తాడు. ఈ క్రమంలో ఆయన తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ మధ్య ‘విశ్వరూపం’ సినిమా విషయంలో కమల్ ఎంత వేదన అనుభవించాడో తెలిసిందే. ఈ సినిమా సమయానికి విడుదల కానివ్వకుండా జయలలిత సర్కారే కుట్ర పన్నినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. జయ సర్కారు సృష్టించిన అడ్డంకులతో విసిగిపోయి దేశం విడిచి వెళ్లిపోతానంటూ చాలా ఆవేదనతో వ్యాఖ్యానించాడు కమల్. ఎలాగోలా అప్పట్లో వివాదం సద్దుమణిగింది. కమల్ సినిమా విడుదలైంది.
ఇక వర్తమానంలోకి వస్తే ప్రస్తుతం తమిళనాడంతా ఒకటే హాట్ టాపిక్. అదే.. అమ్మ అనారోగ్యం. దాదాపుగా తమిళనాడంతా ఒకరకమైన విషాదంలో ఉంది ప్రస్తుతం. కొందరు నిజంగా బాధలో ఉంటే.. ఇంకొందరు బాధలో ఉన్నట్లు నటించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి తమిళనాట ఎక్కడా ఎవరూ సంబరాలు చేసుకోవట్లేదు. దసరా వేడుకలు కూడా కళ తప్పాయి. అక్కడ అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటే.. మీరు సంబరాలు చేసుకుంటారా అని అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఉండటంతో అందరూ సైలెంటుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 7న కమల్ పుట్టిన రోజు వస్తోంది. ఐతే ఆయన సైతం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన అభిమానులకు కూడా ఈ మేరకు సందేశం పంపించారు. జయలలిత అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో ఎవరూ సంబరాలు చేయొద్దని.. సైలెంటుగా ఉండాలని ఆయన చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరి కమల్ నిజంగా అమ్మ గురించి అంత బాధపడుతున్నాడా.. లేక అన్నాడీఎంకే వాళ్లకు భయపడుతున్నాడా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/