'భారతీయుడు 2' చిత్రం ఏ ముహూర్తాన శంకర్ అనుకున్నాడో కాని మొదటి నుండి కూడా ఏదో ఒక ఇబ్బంది మొదలు అవుతూనే ఉంది. మొదట ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తానంటూ ముందుకు వచ్చాడు. బడ్జెట్ విషయంలో భయపడో లేదా మరేంటో కాని దిల్ రాజు తప్పుకున్నాడు. ఆ తర్వాత లైకా వారు ఈ చిత్రంను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కథను దాదాపు మూడు నాలుగు వర్షన్ లుగా సిద్దం చేసుకుని చివరకు ఒక వర్షన్ తో సెట్స్ పైకి వెళ్లాడు. కమల్ హాసన్ మేకప్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చిత్రీకరణ ప్రారంభం అయ్యింది, అంతా సాఫీగా సాగుతుందని భావించిన సమయంలో అనూహ్యంగా సెట్టింగ్ విషయంలో ఏదో తేడా కొట్టిందంటూ వార్తలు వచ్చాయి.
మూడు రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి సెట్టింగ్ లో మార్పులు చేర్పులు చేసి మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్ మొదలు పెట్టి నెల రోజులు కూడా కాకుండానే అప్పుడే 30 కోట్లకు పైగా ఖర్చు చేశారు, బడ్జెట్ మీరు చెప్పిన దానికి రెట్టింపు అయ్యేలా ఉంది అంటూ లైకా వారు భయపడి బడ్జెట్ పరిమితిక అగ్రిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో 250 కోట్ల బడ్జెట్ తో సినిమాను పూర్తి చేస్తానంటూ లైకా వారికి హామీ ఇచ్చినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు 'భారతీయుడు 2' విషయంలో కమల్ హాసన్ కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
శంకర్ ప్రతి సినిమాకు కూడా ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తాడు. కాని భారతీయుడు 2 చిత్రానికి మాత్రం అనిరుథ్ తో సంగీతం చేయించాలని శంకర్ నిర్ణయించాడు. బడ్జెట్ కారణమో లేక మరేంటో కాని ఆ నిర్ణయం కమల్ హాసన్ కు అస్సలు నచ్చడం లేదట. అనిరుథ్ తాజాగా ఒక ట్యూన్ చేశాడని, ఆ ట్యూన్ కమల్ కు ఏమాత్రం నచ్చక పోవడంతో మళ్లీ రహమాన్ ను ఈ చిత్రంలోకి తీసుకు రావాలని కోరుతున్నాడట. కాని శంకర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తాడా లేదంటే శంకర్ ను ఒత్తిడి చేయకుండా లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.