కమల్ హాసన్ అంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ - స్ర్కీన్ ప్లే రైటర్ - యాక్టర్ ని మెప్పించడం అంటే ఆషామాషీనా? కానీ ఈ యంగ్ డైరెక్టర్ మెప్పించాడు. ఎంబీబీఎస్ చేసి డైరెక్టర్ అయ్యాడు. చీకటిరాజ్యం సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం కోలీవుడ్ - టాలీవుడ్ లో ఈ యంగ్ డైరెక్టర్ గురించే చర్చ.
అయితే అతడికి ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి దర్శకుడిగా కొత్త కుర్రాడికి అవకాశం ఎలా ఇచ్చారు? అన్న ప్రశ్నకి కమల్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఒక దర్శకుడిని లేదా ఓ వ్యక్తిలోని ప్రతిభను గుర్తించడం అనేది ఓవర్ నైట్ లో జరగదు. నేను 36 సినిమాలకు పనిచేసిన తర్వాతే బాలచందర్ గుర్తించారు. బహుషా 25వ సినిమా నుంచి ఆయనకు అర్థమయ్యానేమో. ఫర్లేదు .. బాగానే చేస్తున్నావ్ అని అనడానికి అంత టైమ్ పడుతుంది.
నా సినిమా దర్శకుడు రాజేష్ రాజ్ కమల్ బ్యానర్ తో ఏడేళ్లు కాలంగా ట్రావెల్ అవుతూ బాగానే నేర్చుకున్నాడు. ఎంబిబిఎస్ పూర్తి చేసి, డైరెక్టర్ అయ్యాడు. సినిమా కూడా ఓ సర్జన్ చేసే పనిలాంటిదే. ఆ పని విజయవంతంగా పూర్తి చేశాడు. .. అని చెప్పారు. అలాగే టెక్నీషియన్ ని గౌరవించే అలవాటు నాకు ఉంది. స్టార్ అనే పిలుపు కంటే కమల్ హాసన్ అనే టెక్నీషియన్ అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాను. నా యూనిట్ లో ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది అని అన్నారు.
వైవిధ్యాన్ని ఇష్టపడే నటుడు మీరు .. రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వైవిధ్యం ఏం ఉంది? అని అడిగితే.. ఏదేదో చూపించేస్తున్నా అనే గలాటా ఉండదు. కన్ఫ్యూజన్ లేని సినిమా. మీరంతా సినిమా చూసి .. ఇది వేరేగా చేశాడు కదా అని రాజేష్ ని పొగిడేస్తారు అంటూ చెప్పొకొచ్చారు. అదీ సంగతి.