విశ్వనటుడు కమల్ హాసన్ ఓ నెల్లాళ్ల క్రితం పెద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన ఆఫీస్ లోనే పొరపాటున పడిపోయిన ఆయన.. సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి దాదాపు నెల రోజులు ఆస్పత్రిలోనే ఉన్న కమల్.. రీసెంట్ గా ఇంటికి చేరుకున్నారు. అసలు తనకు తగిలిన గాయం కారణంగా.. చావుకు దగ్గరయ్యే పరిస్థితి అంటూ ఆరోజు ఏం జరిగిందో చెప్పారు కమల్. '
చెబుతుంటే ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది. కూలీ షూటింగ్ టైమ్ లో అమితాబ్ బచ్చన్ ఎలా తన చేతిని కాల్చుకున్నారో నా పరిస్థితి అందుకు దగ్గరగానే ఉంటుంది. నేను గత 18 ఏళ్లుగా అక్కడ నిలబడుతూ ఉంటాను. పక్షులకు ఫీడింగ్ చేస్తున్న టైమ్ లో కాలు జారి పడిపోయాను. గాయం కారణంగా చాలానే రక్తం పోయింది. ఆ సమయంలో ఆఫీస్ లో వేరే వ్యక్తులు ఉండబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే నేను చనిపోయేవాడినేమో' అన్నారు కమల్. కాలికి ఇన్ఫెక్షన్ సోకుతుందనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్లు ఎవరినీ అనుమతించలేదని.. ప్రస్తుతం స్నేహితులను కలుసుకుంటానని చెప్పారు
కమల్ హాసన్. అలాగే.. ఇప్పటికిప్పుడు శభాష్ నాయుడు సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేసే అవకాశం లేదన్న కమల్.. మరో రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందన్నారు.