హీరోయిన్‌గా రిటైరయ్యి.. ఏం చేస్తుంది?

Update: 2015-06-12 15:30 GMT
కథానాయిక జీవితం మంచు బిందువు లాంటిది. సక్సెస్‌ లేనిదే ఇక్కడ మనుగడ లేదు. అవకాశాలు వెంటబడి రావాలంటే అందుకు సక్సెస్‌ రేటు ఉండాలి. ఏ నాయిక పరిస్థితి ఎప్పుడు ఎలా అయిపోతుందో ముందే ఊహించలేం. ఓవర్‌నైట్‌లో ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ఇంకా చెప్పాలంటే నాయిక జీవితం తొలకరి వేళలో గడ్డిపోచపై నిలిచే మంచు బిందువు లాంటిది. ఎప్పుడు కరిగిపోతుందో చెప్పలేం.

ఇప్పుడు ఉన్న క్రేజు మునుముందు ఉంటుందా? అంటే చెప్పలేం. ఒకవేళ సక్సెస్‌ కలిసొచ్చి స్టార్‌ హీరోయిన్‌ అయితే 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఏ ఢోకా లేకుండా కెరీర్‌ని సాగించవచ్చు. అందుకే నవతరం నాయికలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. ఈ విషయంలో కమల్‌హాసన్‌ గారాలపట్టీ శ్రుతిహాసన్‌ చాలా అడ్వాన్స్‌డ్‌గానే ఆలోచించింది. ఒకవేళ కథానాయికగా కెరీర్‌ సాగకపోతే సంగీతదర్శకురాలిగా కొత్త కెరీర్‌ని ప్రారంభించడానికి ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉంది. ఈ విషయాన్ని పద్మశ్రీ కమల్‌హాసన్‌ స్వయంగా చెప్పుకొచ్చారు.

ఇటీవలే ఓ వేడుకలో ఆయన తనయురాలి గురించి ముచ్చటిస్తూ.. శ్రుతిహాసన్‌కి సంగీతంలో ప్యాషన్‌ ఉంది. కథానాయిక అవ్వముందు ఓ రాక్‌బ్యాండ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. తను మంచి గాయని కూడా. అందువల్ల హీరోయిన్‌గా కెరీర్‌ కొనసాగకపోతే, సంగీత దర్శకురాలిగా కొత్త పాత్రలోకి పరకాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. బాప్‌రే కూతురి విషయంలో ఓ నాన్నగా ఎంత క్లారిటీ ఉందో కదా!

Tags:    

Similar News