కమల్ హాసన్ డైరెక్ట్ తెలుగు సినిమాలో చాలా కాలమైంది. అప్పుడెప్పుడో 'శుభ సంకల్పం'లో చేశాక మళ్లీ ఆయన టాలీవుడ్ ముఖం చూడలేదు. డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చాన్నాళ్లుగా ఊరిస్తున్న ఆయన.. ఇప్పుడు తన తెలుగు అభిమానుల కోరిక తీర్చేస్తానంటున్నారు. 'చీకటి రాజ్యం' పేరుతో తన తెలుగు సినిమాను మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.
ఐతే బేసిక్‌గా ఇది తమిళ సినిమా. 'తూంగావనం' పేరుతో తమిళంలో తెరకెక్కిస్తూనే తెలుగు వెర్షన్‌కు 'చీకటిరాజ్యం' అని పేరు పెట్టారు. ఇంతకుముందు 'ఈనాడు' సినిమాకు ఇలాగే చేశాడు కమల్. అదే నటీనటుల్ని పెట్టి తెలుగు మాటలకు తగ్గట్లు లిప్ సింక్ అయ్యేలా చూసుకుంటే ఇది తెలుగు సినిమా అయిపోతుందన్నది కమల్ లాజిక్.
''ఇదివరకు ఇక్కడడికి వచ్చినపుడు తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగారు. త్వరలోనే చేస్తానని చెప్పా. కానీ ఎవ్వరూ నమ్మలేదు. నేను మాత్రం నా మాట నిలబెట్టుకుంటూ చీకటిరాజ్యం మొదలుపెట్టా. ఈ సినిమాతో ఆగను. ఇకపై తరచుగా తెలుగులో సినిమాలు చేస్తుంటా'' అన్నారు కమల్. ఐతే ఇలాంటి ద్విభాషా చిత్రాలు కాకుండా ఓ తెలుగు డైరెక్టర్‌తో నేరుగా తెలుగు సినిమా చేస్తేనే చేసినట్లు. లేదంటే అది ప్యూర్ తెలుగు సినిమా కిందికి లెక్కకు రాదు.