ఈ వింత దెయ్యం ఎవరినీ వదిలిపెట్టదు. సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్- షారూక్ ఖాన్ - అక్షయ్ కుమార్ - ప్రభాస్ - రణబీర్ ఎవరినీ వదిలి పెట్టలేదు. ఇప్పుడు మరో యువట్యాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాని కూడా టార్గెట్ చేసింది. ఇక అతడి కెరీర్ ఖతమ్ అనేసింది ఈ దెయ్యం. ఇంతకీ ఈ దెయ్యం ఎవరు? అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతడు వివాదాస్పద క్రిటిక్ కేఆర్కే.
ఇకపై సినిమాలను సమీక్షించబోనని ప్రకటించిన తర్వాత కూడా అతడు తన బాణీని మార్చలేదు. ఇటీవల విడుదలైన 'బ్రహ్మాస్త్ర'ని ఎగతాళి చేసాడు. హిందీ సినిమా చూడని అతిపెద్ద డిజాస్టర్ ను అందించినందుకు కరణ్ జోహార్ కి ధన్యవాదాలు కూడా చెప్పాడు. అంతకుముందు సల్మాన్ సినిమాలను ప్రభాస్ సాహోని కూడా అతడు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ ని అయితే తుత్తునియలు చేస్తూ విమర్శించాడు కేఆర్కే. ప్రతిసారీ 20లక్షల మంది తనను సమీక్షించమని అడుగుతారని ట్వీట్ చేసిన ఈ వివాదాస్పద విమర్శకుడు నటుడు తన ట్విట్టర్ ఖాతాలో ఎవరినీ వదలకుండా విమర్శిస్తున్నాడు.
విక్రమ్ వేదను పేలవమైన చిత్రంగా అభివర్ణించిన కేఆర్కే తర్వాత ఆదిపురుష్ టీజర్ పై నిప్పులు చెరిగారు. ఆ చిత్రం ఇప్పటికే రూ.450 కోట్లు నష్టపోయిందని వ్యాఖ్యానించాడు. కమల్ ఆర్ ఖాన్ ప్రతిభావంతులైన హీరో ఆయుష్మాన్ ఖురానాను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయుష్మాన్ తదుపరి చిత్రం డాక్టర్ జి ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం హిందీ చిత్ర పరిశ్రమలో అతడి కెరీర్ ను శాశ్వతంగా ముగించేస్తుందని అన్నాడు. ''ఆయుష్మాన్ ఖుర్రానా కెరీర్ 100శాతం పూర్తయింది. భవిష్యత్తులో అతని సినిమా ఏదీ హిట్ అవ్వదు. ఆయుష్మాన్ ఖురానా చివరి 3 విపత్తులు! 1) గులాబో సీతాబో! 2) చండీగఢ్ కా! 3) అనేక్! 4వ ది #డాక్టర్ G కావచ్చు.. హీరో టైమ్ ముగిసింది'' అని అంచనా వేస్తూ ట్వీట్ చేశాడు. అసలే బాలీవుడ్ కష్టకాలంలో ఉన్న సమయంలో అతడి విమర్శలు ఇప్పుడు చిర్రెత్తిపోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ అతడిపై లీగల్ గాను యాక్షన్ తీసుకోగా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.
ఆయుష్మాన్ ఖురానా ఒక అద్భుత నటుడు. సమకాలీన హీరోల్లో గొప్పగా రాణిస్తున్నాడు. స్పెర్మ్ డోనర్ కథాంశం ఆధారంగా విక్కీ డోనర్ తో తన సినీ కెరీర్ ను అసాధారణంగా టేకాఫ్ చేసాడు. తరువాత అతను శుభ్ మంగళ్ సావధాన్ - బాలా- బదాయి హో- చండీగఢ్ కరే ఆషికి మొదలైన వైవిధ్యమైన అంశాలు ఉన్న చిత్రాలలో నటించడంతో సంచలనంగా మారాడు. ఈ చిత్రాలన్నింటిలో సాధారణ అంశం ఏమిటంటే ఇవన్నీ కొంచెం బోల్డ్‌గా ఉన్నప్పటికీ నిజాలను ప్రజలకు ఆవిష్కరించాయి. కుటుంబ వీక్షణకు సరిపోయే కంటెంట్ ని అందించాడు. ఫలితంగా ఈ చిత్రాలన్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి U/A సర్టిఫికేట్ పొందాయి.
ఇప్పుడు డాక్టర్ G మాత్రం CBFC నుండి A సర్టిఫికేట్ పొందింది. దీంతో అడల్ట్స్ రేటింగ్ పొందిన ఆయుష్మాన్ ఖురానా మొదటి చిత్రంగా నిలిచింది. డాక్టర్ జి ఆయుష్మాన్ ఖురానా తన పదేళ్ల కెరీర్ లో A రేటింగ్ ను పొందిన మొదటి చిత్రంగా ఉద్భవించిందని తెలుసుకోవడం అభిమానులను సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ - షెఫాలీ షా తదితరులు నటించారు. అక్టోబర్ 14న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం కాన్సెప్ట్ కాస్త వింతైనది. ఒక స్త్రీ జననేంద్రియ నిపుణుడి గురించిన కథ.... CBFC సభ్యులు ఫ్యామిలీ ఆడియెన్ కి సరిపోయే విధంగా లేదని భావించింది. రకరకాల డబుల్ మీనింగ్ జోకులతో నిండి ఉంది. అలాగే మేకర్స్ A రేటింగ్ ని ఎంచుకోవాలని సెన్సార్ వారు సూచించారు. మేకర్స్ ఆ సన్నివేశాలు డైలాగ్ లను కత్తిరించడం వల్ల సబ్జెక్ట్ స్పిరిట్ దెబ్బతింటుంది. అందుకే ఏ రేటింగ్ ఓకే చెప్పారట.
ఆసక్తికరంగా డాక్టర్ జికి A రేటింగ్ ని మేకర్స్ ఆమోదించిన తర్వాత CBFC ఎటువంటి కట్ అడగలేదు. అక్టోబర్ 4న నిర్మాతలకు సర్టిఫికేట్ అందజేసారు. సెన్సార్ సర్టిఫికేట్ లో పేర్కొన్న విధంగా సినిమా నిడివి 124 నిమిషాలు. మరో మాటలో చెప్పాలంటే డాక్టర్ జి 2 గంటల 4 నిమిషాల నిడివితో అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్ను ఉందని తెలిసింది. రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.