బిజినెస్‌ కు మాత్రం 'కంచె' పడలేదు

Update: 2015-09-19 04:59 GMT
అబ్బో ట్రైలర్‌ కేక... ఆ లుక్కుతో ఆడియన్స్‌ మనస్సులకు కంచె పడిపోయింది. క్రిష్‌ కథ కేక... ఆ దెబ్బకి చాలామంది హీరోలకు మదిలో ఇతగాడితో సినిమా చేయాలనే కంచె పడింది. వరుణ్‌ తేజ్‌ గట్స్‌ అదిరే... మెగా ఫ్యాన్స్‌ మదిలో ఆనందాన్ని ఆపలేని కంచె పడింది. ఇవన్నీ సరే.. అసలు ఈ సినిమాకు పంపిణీదారులు ఎటువంటి కంచెలు వేస్తున్నారు??

నిజానికి ఇప్పటివరకు దర్శకుడు క్రిష్‌ తీసిన సినిమాలన్నింటికీ బీభత్సమైన పేరు వచ్చింది. గమ్యం నుండి వేదం వరకు.. వయా కృష్ణం వందే జగద్గురుమ్‌.. అదిరిపోయాయ్‌ అన్నారు గాని.. అసలు డబ్బుల మాత్రం రాలేదు. కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం లేదు. అందుకే అద్భుతమైన విజువల్స్‌ చూపించినా.. సీతారామ శాస్ర్తి ఒక తరాన్ని కదిలించే సాహిత్యం అందించినా.. ఎవరూ ఎన్నుకోని రెండవ ప్రపంచం నాటి కథను వండివార్చినా.. అబ్బే ఇంతవరకు సినిమాకు సరైన ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ మాత్రం కాలేదట.

పెట్టుబడి ఎంత పెట్టాడో తెలియదు కాని.. ఒక 30 వరకు అయ్యుంటుందని ఒక అంచనా. అదంతా రికవర్‌ చేయాలంటే.. అయితే క్రిష్‌ తీసిన గత సినిమాలు.. లేదా ముకుందా సినిమా బాక్సాఫీస్‌ రికవరీ చూస్తారూ.. రెండింటిలో ఏది చూసినా కూడా 20 వరకు వర్కవుటైతే గగనమే అంటున్నారు విశ్లేషకులు. వరస్ట్‌ కేస్‌ లో సొంతంగా సినిమాను రిలీజ్‌ చేయడానికి హెల్ప్‌ చేస్తానంటూ పెద్దాయన అల్లు అరవింద్‌ ఓ మాటిచ్చారటలే. కాని అలా కాకుండా త్వరలో సినిమా బిజినెస్‌ పూర్తయ్యి కంచె పడుతుందని కోరుకుందాం.
Tags:    

Similar News