స్టాండప్ కమెడియన్ విర్ దాస్ ఉత్తరాదిన ఎంత ఫేమస్ కమెడియనో తెలిసిందే. వెండి తెరతోపాటు బుల్లి తెరపైనా విర్ దాస్ ఎంతో ఫేమస్. చాలా వెబ్ సిరీస్ లలోనూ నటించి నటుడిగా తనదైన మార్క్ వేసాడు. అయితే ఓ కార్యక్రమంలో విర్ దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెలిజనులు కంగన రనౌత్ కి అడ్డంగా దొరికిపోయాడు.
``పగటిపూట మహిళల్ని పూజించే దేశం లో..రాత్రి వేళ్లలో వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ``ని ఓ ఈవెంట్ లో విర్ దాస్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికపై నెటిజనులు.. భారతీయ మహిళలంతా భగ్గుమన్నారు.
భారతదేశంలో పుట్టి మహిళల్ని కించపరిచేలా విర్ దాస్ మాట్లాడాడు అంటూ మండిపడ్డారు. దీనికి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలని.. కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ కి దిగాయి. తాజాగా ఆ వేడికి కాంట్రవర్శీ క్వీన్ కంగన కూడా తోడైంది. సరిగ్గా లీగల్ పాయింట్ తో కంగన తనదైన శైలిలో కౌంటర్ వేసింది .
``భారతీయ పురుషులందర్నీ గ్యాంగ్ రేపిస్టులుగా చిత్రీకరిస్తూ విర్ దాస్ మాట్లాడాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులపై జాత్యాహంకారం.. బెదిరిపులకు దారితీసేట్టు ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. భారతీయుల సంతానోత్పత్తిని నిందించాడు. మొత్తం జాతినే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని సాప్ట్ టెర్రరిస్టులుగా భావించాలి`` అంటూ క్వీన్ చెలరేగింది.
ఇలాంటి నేరస్థులపై చట్టబద్ధంగా శిక్షించాలని కంగన అగ్గీమీద గుగ్గిలమైంది. కంగన వ్యాఖ్యలతో నెటిజనులుంతా ఏకీభవిస్తున్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడిన విర్ దాస్ ని శిక్షించాలని..మళ్లీ భవిష్యత్ లో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గుణపాఠం చెప్పాలని మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి విషయాల్లో కంగన మెరుపు వేగంతో స్పందించడం కొత్తేమీకాదు. మహిళల హక్కులు.. మనోభావాలు ఏవైనా దెబ్బతినేలా మాట్లాడితే చెడుగుడు ఆడేస్తుందని మరోసారి రుజువు చేసింది.