బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జోరు మామూలుగా లేదు. మేల్ డామినేటెడ్ బాలీవుడ్ లో ఇప్పటికే తనొక లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది. కంగనా లాస్ట్ ఫిలిం 'మణికర్ణిక' 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో తన బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి రుజువైంది. ఇక కంగనా ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా క్రేజీగా ఉన్నాయి. ప్రస్తుతం కంగనా చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కంగనా నెక్స్ట్ ఫిలిం 'జడ్జిమెంటల్ హై క్యా' ఈనెలలోనే రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
'జడ్జిమెంటల్ హై క్యా' ట్రైలర్ సంచలనం ఇంకా సద్దుమణగక ముందే కంగనా అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. కంగనా నటిస్తున్న మరో సినిమా 'ధాకడ్' ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. ఫస్ట్ లుక్ పోస్టర్లో కంగనా రెండు మెషీన్ గన్లతో ఒక లేడీ కమాండో తరహాలో కనిపిస్తోంది. ప్యాంట్ టీ-షర్టు ధరించి ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. నేపథ్యంలో ఫుల్లుగా మంటలు ఉండడంతో ఈ పోస్టర్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కు శాంపిల్ లా అనిపిస్తోంది.
ఈ సినిమాకోసం ఒక హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రజనీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. అసైలమ్ ఫిలిమ్స్.. సొహెల్ మక్లాయ్ ప్రొడక్షన్స్ ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తారట. ఈ సినిమాకు కథ అందించిన వారు రజనీష్.. రినీష్ రవీంద్ర.. చింతన్ గాంధీ. ఈ సినిమా షూటింగ్ ఇండియాతో పాటుగా గల్ఫ్.. ఐరోపాలోని కొన్ని దేశాల్లో జరుపుతారని దర్శకుడు వెల్లడించాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేస్తారట.
కంగనా ప్రస్తుతం అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పంగా'.. ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రాలలో కూడా నటిస్తోంది.