కంగనా.. అది పిచ్చి పని అని మీకు అనిపించలేదా!

Update: 2022-08-11 00:30 GMT
బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ ఉన్నా కూడా ఏదో ఒక సినిమా ను ఆమె చేస్తూనే ఉంది. ఇటీవల ఆమె నటించిన ధకడ్‌ మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం కు ఏమాత్రం నిరాశ పడకుండా ప్రస్తుతం ఆమె ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాను చేస్తోంది.

ఇటీవల విడుదల అయిన ఫస్ట్‌ లుక్ కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొంది.

ఇటీవల ఆమె తీవ్రమైన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతుంది. అదే సమయంలో ఆమె తెల్ల రక్తకణాలు కూడా చాలా తగ్గాయని వైధ్యులు అన్నారట. అయినా కూడా ఎమర్జెన్సీ వర్క్ ఆగనివ్వలేదు.

ఎమర్జెన్సీ షూటింగ్‌ కోసం అంత జ్వరంతో కూడా ఆమె రావడం ను మణికర్ణిక ఫిల్మ్స్‌ సభ్యులు స్పందించారు. మీరు అంత జ్వరంతో కూడా షూటింగ్ కు రావడం ను మీ యొక్క సినిమా అభిరుచి అని మేము అనుకోవడం లేదు.. అది మీ పిచ్చి పని అనుకుంటున్నాం. అంత జ్వరంతో షూటింగ్ కు రావడం మీకు పిచ్చి అని మీకు అనిపించడం లేదా అన్నారు. అదే సమయంలో మీరు మా అందరికి ఆదర్శం అని కూడా పేర్కొన్నారు.

కంగనా ఆ పోస్ట్‌ కు స్పందించింది. నా ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు టీమ్ కు కృతజ్ఞతలు. శరీరానికి ఆనారోగ్యం వచ్చింది.. అంతే తప్ప నా మనసు కు కాదు అన్నట్లుగా పేర్కొంది.

కష్టపడే విషయంలో బాలీవుడ్ లో కంగనా తర్వాతే ఎవరైనా అనడంలో సందేహం లేదు. ఆమె తన ప్రతి సినిమాకు కూడా చాలా కష్టపడుతారు. కాని చాలా వరకు ఆమె కష్టం ఈ మధ్య కాలంలో బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా ఉంటుంది.
Tags:    

Similar News