క్వీన్ కంగన తానేం చెప్పదలిచినా సూటిగా అది చెప్పేయడం తన స్టైల్. రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించినా.. పరిశ్రమ మాఫియాని విమర్శించినా అధికారులను తూలనాడినా దేనికీ భయపడని రెబలిజం తన సొంతం. తాజాగా తన మొదటి చిత్రం గ్యాంగ్ స్టర్ విడుదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తనని తాను షారూక్ తో పోల్చుకోవడం .. ఆయన కథతో పోలికలు చెప్పడం విస్మయపరిచింది.
షారూక్ తల్లిదండ్రులు సినీతారలు. వారు పరిశ్రమలో నటులుగా కొనసాగారని తెలిపిన కంగన.. SRK తల్లిదండ్రులు సినీ పరిశ్రమలో ఒక భాగమని ఎవ్వరూ కనిపెట్టలేదు! అంటూ వ్యాఖ్యానించారు. అలా కాకుండా తాను మాత్రం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చానని..హిమచల్ ప్రదేశ్ లోని మారుమూల గ్రామం నుంచి వచ్చి మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నానని పేర్కొన్నారు.
పదిహేనేళ్ల క్రితం గ్యాంగ్ స్టర్ ఇదే రోజు విడుదలైంది. షారుఖ్ ఖాన్ జీ గొప్ప సక్సెస్ ఫుల్ హీరోగా చరిత్రకు ఎక్కారు కానీ..షారూక్ దిల్లీకి చెందినవాడు.. కాన్వెంట్ విద్యావంతుడు.. అతని తల్లిదండ్రులు సినిమాల్లో నటించారు. నాకు ఇంగ్లీష్ ఒక్క మాట కూడా తెలియదు.. విద్య లేదు.. హిమచల్ ప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం నా స్వంత తండ్రి - తాతతో మొదలైంది నా జీవితం. వారంతా నా జీవితాన్ని దుర్భరంగా మార్చారు.. అని తన కథను తెలిపారు. ఇంకా 15 సంవత్సరాల తరువాత కూడా చాలా గొప్ప విజయాలు సాధించిన తరువాత ఇప్పటికీ ప్రతిరోజూ మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నానని తెలిపారు. కంగన ప్రస్తుతం తలైవి- ధాకడ్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.