క్వీన్ కంగన రనౌత్ - రాజ్ కుమార్ రావ్ జంటగా ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన `జడ్జిమెంటల్ హై క్యా` విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కంటెంట్ తో సినిమా తీసినందుకు.. లీడ్ పెయిర్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి పేరు బయటికి ప్రస్థావించకుండా కంగన ఆడిన మైండ్ గేమ్ ప్రముఖంగా చర్చకు వచ్చింది.
ఇకపోతే `జడ్జిమెంటల్ హై క్యా` సినిమా రకరకాల వివాదాల కారణంగా సీబీఎఫ్ సీ బృందంతో పాటు సైకాలజీ డిపార్ట్ మెంట్ సైతం రిలీజ్ ముందే వీక్షించిన సంగతి తెలిసిందే. అలాగే రిలీజై ఘనవిజయం సాధించాక అసలు ఈ సినిమాలో ఏం ఉందో చూడాలన్న ఆసక్తి పలువురు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల్లోనూ కనిపించిందట. దీంతో రాష్ట్రపతి భవన్ ప్రత్యేకించి సీబీఎఫ్ సీ వాళ్లను అభ్యర్థించి ఈ సినిమాను స్పెషల్ షో వేయాల్సిందిగా కోరిందట.
ఆగస్టు 3న దిల్లీలో రాష్ట్రపతి భవన్- ఫిలిం డివిజన్ ఆఫ్ ఇండియా థియేటర్ లో `జడ్జిమెంటల్ హై క్యా` చిత్రాన్ని ప్రదర్శించారు. పలువురు మంత్రులు .. స్టాఫ్ ఈ స్పెషల్ ప్రీమియర్ ని వీక్షించారు. షో వీక్షించిన అనంతరం నటీనటుల ప్రదర్శన.. దర్శకుని పనితనంపై ప్రశంసలు కురిపించారట. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్- శోభాకపూర్ - శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మించారు. కంగన ఈ చిత్రంలో బాబి అనే పాత్రలో నటించగా రాజ్ కుమార్ రావ్ కేశవ్ అనే పాత్రలో నటించారు.