సింగిల్ పీస్ గౌన్ లో కాస్మో కంగనా

Update: 2016-10-19 19:30 GMT
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి యాక్టింగ్ లో ఏ రేంజ్ ట్యాలెంట్ ఉందో.. ఎక్స్ పోజింగ్ లో అంతకు మించే ఉంది. పైగా బీ గ్రేడ్ సినిమాల్లో నటించే హీరోయిన్ తానొక్కతే అంటూ డేరింగ్ స్టేట్మెంట్లు ఇవ్వగల సత్తా కేవలం కంగనకు మాత్రమే ఉంటుంది. చాలామంది చెప్పేవన్నీ మాటలకే పరిమితం చేస్తారు కానీ.. కంగన మాత్రం ఆచరణలో కూడా చేసి చూపెట్టేస్తుంది.

కాస్మోపాలిటన్ మేగజైన్ రీసెంట్ ఎడిషన్ పై కంగనా రనౌత్  మిలమిలలాడింది. క్లీవేజ్ అంతా కనిపించేలా డిజైన్ చేసిన సింగిల్ డిజైనర్ పీస్ గౌనులో కంగన లుక్ మైండ్ బ్లాకింగ్ గా ఉందంతే. సొంపుల్లోని ఒంపులన్నీ చూపిస్తూ.. ఈ రేంజ్ లో అందాలను ఆరేయడం అందరికీ సాధ్యమే కానీ.. ఆ కళ్లలో కనిపించే మెరుపు మాత్రం క్వీన్ కంగనాకి మాత్రమే పరిమితం. పైగా కర్లింగ్ హెయిర్ ని క్యాచీ లుక్ కి మార్చి కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసినట్లుగా కూడా అనిపిస్తుంది. కాస్మోపాలిటన్ అనే పదానికి సరైన ఎగ్జాంపుల్ లా తయారైపోయిన కంగనా.. కళ్లతోనే మాయ చేసేస్తోంది.

ఈ రేంజ్ ఈ ఎడిషన్ కి స్పెషల్ ఏంటంటే.. మేగజైన్ పై కనిపించే అందం మాత్రమే కాదు.. లోపలి పేజీల్లో మరింతగా రెచ్చిపోయిన షోకులు కనిపిస్తాయి. అయితే.. కంగన ఎవరికీ ఎందుకు భయపడదని... తనే స్వయంగా చెప్పిన సంగతులే ప్రధాన ఆకర్షణ అంటున్నారు అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News