క్వీన్ కంగన రనౌత్‌లో అతి ఎక్కువైందా? స్వయంకృషితో ఎదిగిన ఈ అమ్మడి ఆలోచనలు విప్లవాత్మకంగా ఉంటాయని సరిపుచ్చుకోవాలా? లేక టూమచ్ అవుతున్నాయని విమర్శించాలా? ప‌్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. గత కొంతకాలంగా క్వీన్ కంగన వ్యవహారం కొందరికి గిట్టడం లేదు. ఈ అమ్మడు ఏకంగా స్టార్ హీరోలు - నిర్మాతలనే ఏకేస్తోంది. నెప్టోయిజం పేరుతో నటవారసుల్ని .. అగ్ర నిర్మాతల్ని ఆటాడుకుంటోంది. అవకాశం దొరకాలే కానీ తన వ్యతిరేకుల్ని ఒక్కొక్కరిని రోడ్డెక్కించేందుకైనా వెనకాడడం లేదు. కెరీర్ ఆరంభం తనని వెంటాడిన వాళ్లందరి లిస్ట్ రాసుకుని మరీ వేటాడుతోంది.
అదంతా అటుంచితే ఈ అమ్మడు జయలలిత బయోపిక్ ని ఖాయం చేసుకున్న అనంతరం మరింతగా చెలరేగిపోవడంపై యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అమ్మ జయలలిత జీవితంతో తన జీవితానికి సారూప్యత ఉందని కంగన వ్యాఖ్యానించింది. ఆమె కథ నా కథ ఒకటే అంటూ బిల్డప్ ఇస్తోంది. మరోవైపు మణికర్ణిక చిత్రంలో తన నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలని మీడియా ముందు బచాయించడం చూస్తుంటే క్వీన్ ఆలోచనలు ఎంత పీక్స్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదొక్కటేనా కంగనలో టెంపరితనం ఎంత వెతికితే అంతగా తనలోని ఈగోయిస్టిక్ పర్సనాలిటీ బయట పడుతూనే ఉంది. తన కంటే జయలలిత ఎక్కువ సాధించారు గనుకే.. నా ఆటోబయోగ్రఫీ రాసుకుని అందులో నటించకుండా - అమ్మ బయోపిక్ లో నటించేందుకు సంతకం చేశానని బిల్డప్ ఇచ్చేసింది. మొత్తానికి కంగన వాలకం చూస్తుంటే అతి మరీ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. వరుసగా తాను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్లు కొట్టేస్తుండడంతో ఈ అమ్మడి నాలుకకు అదుపన్నదే లేకుండా పోయింది. ఇకపోతే జయలలితతో కంగనకు పోలికేంటి? అంటూ అమ్మ అభిమానులు ఓ రేంజులో విమర్శిస్తున్నారు. జయలలిత కంగనలా వివాదాస్పద నటి కాదు. అంతటి టెంపరితనం లేదు. పైగా ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉన్న నటి. పైగా రాజకీయాల్లోకి వచ్చి తలైవిగా పిలుపు అందుకున్నారు. తనని నమ్మిన వారికి అన్నం పెట్టిన గొప్ప నాయకురాలిగా పేరు పొందారు. అలాంటి అగ్ర కథానాయిక, రాజకీయ నేతతో కంగనకు పోలికేంటి? అంటూ మాట్లాడుకుంటున్నారు. కంగన ఈ బిల్డప్ ని కాస్తంత తగ్గిస్తే బావుంటుందని సెలవిస్తున్నారు. అయితే రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు గెలుచుకున్న కంగనకు ఆ రెబలియన్ యాటిట్యూడ్ అలంకారం అనే వాళ్లు లేకపోలేదు.