'మణికర్ణిక' తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్ అతి త్వరలోనే 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్ రావు మరియు బ్రిజేంద్రకల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ వివాదం తలెత్తడంతో కొన్ని రోజుల క్రితం విడుదలవ్వాల్సిన ట్రైలర్ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం కారణంగానే నేను ఇలా ఉన్నాను. దేనైనా ఎదిరించే శక్తిని నాకు అభిమానులే ఇచ్చారు. సినిమా పరిశ్రమ గురించి నేను అస్సలు పట్టించుకోను. ఇండస్ట్రీ వారు ఏమనుకున్నా నేను అనుకున్నది చేయడం.. మాట్లాడటం చేస్తూ ఉంటాను. నాకు ఇంత ధైర్యంకు కారణం నా అభిమానులే. ఎవరైతే నాకు మద్దతుగా నిలుస్తున్నారో వారందరికి రుణపడి ఉంటానంటూ కంగనా చెప్పుకొచ్చింది.
సినిమా పరిశ్రమలో కంగనా గురించి పలు విమర్శలు ఉన్నాయి. ఆమె దర్శకుల పనుల్లో ఇన్వాల్వ్ అవుతుందని కొందరు.. ఆమె తన పాత్రకు తానే డైరెక్ట్ చేసుకుంటుందని కొందరు అంటూ ఉంటారు. ఆ విషయాలను పట్టించుకోని కంగనా స్టార్స్ అనే విషయం కూడా చూడకుండా గతంలో పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఒక నటుడు వేదించాడంటూ కేసు కూడా పెట్టిన విషయం తెల్సిందే. ఇదంతా కూడా అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే చేస్తున్నాను అన్నది ఆమె ఉద్దేశ్యం.