త‌ల‌లు న‌ర‌కాల‌న్న కంగ‌న‌.. ట్విట్ట‌ర్ బ్యాన్?

Update: 2021-01-20 15:30 GMT
`కంగ‌న వ‌ర్సెస్ తాండ‌వ్` ఎపిసోడ్ గురించి తెలిసిన‌దే. ఈ వివాదం అనంత‌రం కంగ‌న ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా పరిమితం చేయ‌డంపై కంగ‌న త‌న‌దైన శైలిలో ఫైరైంది. బ్యాన్ కంగ‌న అంటూ త‌న‌పై దేశ విద్రోహ‌శ‌క్తులు కుట్ర ప‌న్నాయ‌ని కంగ‌న ఆరోపించారు.  ట్విట్ట‌ర్ సీఈవోని కంగ‌న తూల‌నాడ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాండవ్ క్రియేట‌ర్ల‌నుద్ధేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ట్విట్ట‌ర్ లో కంగ‌న యాక్టివిటీస్ ప‌రిమితం చేస్తూ ఖాతాను లాక్ చేశారు. తాండ‌వ్ వెబ్ సిరీస్ ‌లో హిందూ దేవుళ్ళను అవమానించారనే ఆరోపణలపై కంగ‌న స్పందిస్తూ.. ``వారి తలలు తీసే సమయం వ‌చ్చింది`` అంటూ తీవ్ర వ్యాఖ్యానం చేసారు. అనంత‌రం సీరియ‌స్ ప‌రిణామాలు అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

కార‌ణం ఏదైనా త‌న ట్విట్ట‌ర్ ని ప‌రిమితం చేసిన `ఉదార స‌మాజం`పై త‌న‌దైన శైలిలో దుమ్మెత్తి పోసారు కంగ‌న‌. ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సీని `చాచా ...` అంటూ వ్యంగ్యంగా పిలిచారు‌. లిబ్రస్ వారి చాచా జాక్ ... నా ఖాతాను తాత్కాలికంగా పరిమితం చేసాడు అంటూ కామెంట్ చేసారు కంగ‌న‌.

నా  ఖాతా వర్చువల్ ఐడెంటిటీ ని అడ్డు పెట్టుకుని బెదిరిస్తున్నారు. నా వర్చువల్ ఐడెంటిటీ ఎప్పుడైనా దేశం కోసం అమరత్వం పొందొచ్చు. కాని నా రీలోడ్ చేసిన దేశభక్తి స్ఫూర్తి నా సినిమాల ద్వారా మళ్లీ కనిపిస్తుంది. నేను మీ జీవితాన్ని దయనీయంగా మార్చేస్తాను.. అంటూ కంగ‌న సీరియ‌స్ అయ్యింది.

వ్యతిరేక జాతీయులు కొంద‌రు `స‌స్పెండ్ కంగ‌న ర‌నౌత్` హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు వారు నన్ను సస్పెండ్ చేస్తే వర్చువల్ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాను. వాస్తవ ప్రపంచంలో మీకు నిజమైన కంగన ఎలా ఉంటుందో చూపిస్తాను.. అంటూ కంగ‌న టీమ్ పేర్కొంది.

మతతత్వ వైరుధ్యానికి తెర తీస్తోంద‌ని .., హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ `తాండవ్` పై ప‌లువురు విరుచుకుప‌డుతున్నారు.  దీనికి షో సృష్టికర్త అలీ అబ్బాస్ జాఫర్ మొత్తం తారాగణం .. సిబ్బంది తరపున క్షమాపణలు చెప్పారు. వారు ఎవరినీ కించపరచాలని లేదా ఏ మతాన్ని రాజకీయ పార్టీని అవమానించాలని భావించలేదు. సమస్యలను పరిష్కరించడానికి కంటెంట్ ‌లో మార్పులు చేస్తామ‌ని కూడా తెలిపారు.
Tags:    

Similar News