ఇరుగుపొరుగున విజయవంతమైన చిత్రాలను తెలుగులోకి అనువదించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కేటగిరీలో థియేట్రికల్ రిలీజ్ కి వస్తున్న సినిమా `కాంతారా`. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా కన్నడంలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. `కాంతారా` (తిరుగులేని మృగం) బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రం రెండవ బుధవారం సుమారుగా 4.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికి మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ. 58.50 కోట్లు. ఇందులో రూ. కర్ణాటక నుంచి 56.25 కోట్లు వచ్చాయి. రెండో వారం ఆరు రోజుల్లోనే ఈ సినిమా సుమారు 32 కోట్లు వసూలు చేసిందని .. పూర్తి వారం లో దాదాపు రూ. సుమారు 36 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఈ చిత్రం రోజువారీ కలెక్షన్స్ లో స్వల్ప డ్రాప్ లతో అధిక వాల్యూమ్ లో కలెక్షన్లను మేనేజ్ చేస్తోందని సమాచారం. ఇది మనసును కదిలించే సినిమా.. అందుకే కన్నడిగులకు నచ్చింది. ఈ చిత్రం రెండవ వారం ప్రారంభంలో రెండవ శుక్రవారం అద్భుత వసూళ్లను సాధించింది. ఇప్పుడు రెండవ శుక్రవారం కంటే కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా కొన్ని సమయాల్లో మొదటి వారంలో ఇటువంటి ట్రెండింగ్ కనిపిస్తుంది. కానీ రెండవ వారంలో కూడా కాంతారా హవా కొనసాగింది. ఈ చిత్రం ఇప్పుడు కర్ణాటకలో రోజువారీ కలెక్షన్లలో KGF చాప్టర్ 2 ని బీట్ చేస్తోందని కథనాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కాంతారా ఇప్పుడు కర్నాటకలో KGF 2 (రూ. 171.50 కోట్లు) - RRR (రూ. 86 కోట్లు) తర్వాత మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా సాగుతున్న తీరు రూ. 100 కోట్లు పైగా వసూలు చేస్తుందని చెబుతున్నారు. మూడు అంకెల మార్కును చేరుకోవాలంటే మూడో వారంలో 20 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్లు వచ్చే వారం విడుదల కానున్నాయి. హిందీ - తెలుగు వెర్షన్లు శుక్రవారం విడుదల కానుండగా తమిళ వెర్షన్ శనివారం విడుదల కానుంది. కర్ణాటకలో సినిమాకు లభిస్తున్న ఆదరణలో కొంత భాగాన్ని డబ్బింగ్ వెర్షన్ లు పొందగలిగితే అది భారీ ఆల్ ఇండియా వసూళ్ల నంబర్ ని సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్ ని కాంతారా టైటిల్ తోనే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు అనువాదం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద `కాంతారా` బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. మొదటి వారం - రూ. 26.25 కోట్లు వసూలు చేయగా..2వ శుక్రవారం - రూ. 4.40 కోట్లు.. 2వ శనివారం - రూ. 6.50 కోట్లు.. 2వ ఆదివారం - రూ. 7.50 కోట్లు .. 2వ సోమవారం - రూ. 4.75 కోట్లు.. 2వ మంగళవారం - రూ. 4.60 కోట్లు ..2వ బుధవారం - రూ. 4.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం - రూ. 58.50 కోట్లు వసూలైంది.