కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు హిందీలో కూడా ఈ సినిమాకు రెండు వారాలు పూర్తయినా కూడా మంచి కలెక్షన్స్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శని ఆదివారాలు ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది.
ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల్లో కాంతార నెంబర్ వన్ లిస్టులో కొనసాగుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇక నిర్మాతలు అయితే నవంబర్ 4వ తేదీ ఓటీటీలోకి రాబోతోంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు రూమర్స్ ను నమ్మకూడదు అని కూడా తెలియజేశారు.
ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుంచి కొన్ని ఆఫర్లు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అనుకున్న డీల్ కంటే ముందుగానే సినిమాను విడుదల చేసుకుంటే మరొక రేటును మాట్లాడుకునే విధంగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కొన్ని రోజులపాటు పేపర్ వ్యూ రెంట్ పద్ధతిలోనే విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు గాదులుస్తోంది.
ఇదివరకే కొన్ని పెద్ద సినిమాలకు ఇదే తరహాలో ప్రణాళికలు రచించిన అమెజాన్ ప్రైమ్ మంచి ప్రాఫిట్స్ అయితే అందుకుంది.
ఇక కాంతార సినిమాకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెంట్ పద్ధతిలోనే మొదట స్ట్రీమింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ రూట్లో కూడా నిర్మాతలకు షేర్ అందుతుంది అంటే తప్పకుండా అమెజాన్ ప్రైమ్ కొత్త డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈ డీల్ సక్సెస్ అయితే గనక నవంబర్ సెకండ్ వీక్ లోనే రెంట్ పద్ధతిలో కాంతార అమెజాన్ ప్రైమ్ లో సందడి చేసే అవకాశం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.