'కాంతార‌'కు రిష‌బ్ శెట్టి అంతే తీసుకున్నాడా?

Update: 2022-12-21 03:30 GMT
సైలెంట్ గా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న క‌న్న‌డ సెన్సేష‌న్ `కాంతార‌`. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి తెర‌కెక్కించారు. `కేజీఎఫ్‌` మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించారు. స‌ప్త‌మిగౌడ హీరోయిన్ గా న‌టించ‌గా కీల‌క పాత్ర‌ల్లో అచ్యుత్ కుమార్, కిషోర్ న‌టించారు. రూ. 16 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. క‌న్న‌డ‌తో పాటు త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

మౌత్ టాక్ రికార్డు స్థాయిలో స్ప్రెడ్ కావ‌డంతో ఊహించ‌ని విధంగా ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది. కేవ‌లం రూ. 16 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల‌కు పై చిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి `కేజీఎఫ్ 2` త‌రువాత సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డుల్ని సృష్టించిన ఈ మూవీపై సెల‌బ్రిటీలు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

చివ‌రి 15 నిమిషాల్లో రిష‌బ్ శెట్టి ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. ఇంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి ఈ మూవీకి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంత‌? .. కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన వారికి ద‌క్కిన మొత్తం ఎంత అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మూవీకి హీరోగా, ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసిన రిష‌బ్ శెట్టికి పారితోషికం కింద రూ. 4 కోట్లు ద‌క్కాయ‌ట‌.

మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన వారికి ప్ర‌త్రల ప్రాముఖ్య‌త‌ని బ‌ట్టి పారితోషికం ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. మీరోయిన్ స‌ప్త‌మి గౌడ‌కు, కీల‌క పాత్ర‌లో ఫారెస్ట్ ఆఫీస‌ర్ గా న‌టించిన కిషోర్ చెరో కోటి అందుకున్నార‌ట‌.

ఇక కీల‌క‌మైన విల‌న్ పాత్ర‌లో న‌టించిన అచ్యుత్ కుమార్ 40 ల‌క్ష‌లు, సుధార‌క‌ పాత్ర‌లో న‌టించిన ప్ర‌మోద్ శెట్టి 60 ల‌క్ష‌లు తీసుకున్నార‌ట‌. 400 కోట్ల‌కు పై చిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీని అందించిన రిష‌బ్ శెట్టికి పారితోషికంతో పాటు హోంబ‌లే ఫిలింస్ వారు కాస్ట్లీ గిఫ్ట్ ని ఇవ్వాల్సింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News