కాంతారా ప్రీక్వెల్.. స్టోరీ సిద్ధం

Update: 2023-01-21 06:11 GMT
రిషబ్ శెట్టి హీరోగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో విజయ్ కిరంగదూర్ నిర్మించిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి  దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.

ఎలాంటి స్టార్స్ లేకుండానే కేవలం కథ బలంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఈ మధ్యకాలంలో కాంతారా మూవీతోనే సాధ్యమైందని చెప్పాలి. కన్నడంలో తెరకెక్కిన సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో డబ్బింగ్ అయింది. ఒరిజినల్ ఫీల్ ఏ మాత్రం చెడిపోకుండా స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల్ని మెస్ప్రైజ్ చేసింది.

నార్త్ ఇండియాలో కాంతారా సినిమాకి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ రావడం విశేషం. తెలుగులో కూడా సుమారు 60 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న రెండో సినిమా కాంతారా కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశారు. రిషబ్ శెట్టి ఎప్పుడంటే అప్పుడు సినిమా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శకుడు హీరో రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంతారా సినిమా స్టోరీ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన కథని ఈ సీక్వెల్ లో రిషబ్ శెట్టి చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మొదటి సినిమాకి వచ్చిన హైప్ నేపథ్యంలో ఈ సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు టాక్. ఇక దీనికి సంబంధించిన స్టోరీ రాసే పని రిషబ్ శెట్టి మొదలుపెట్టినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు అఫీషియల్ గా లాంచ్ అవుతుందనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News