బాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ బడా నిర్మాత.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం బీ టౌన్ లో కలకలం రేపింది. బోనీ కపూర్ తన ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్ ఖుషీ లతో కలిసి ఉన్న ఇంట్లో పని చేసే వాళ్లలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ ముగ్గురు హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. గత 14 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్న తర్వాత వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరందరికి నెగిటివ్ వచ్చింది. అంతేకాకుండా వీళ్లింట్లో పని చేసే వాళ్లకు కూడా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ ముగిసిన విషయాన్ని బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
బోణీ కపూర్ ట్వీట్ చేస్తూ ''నాకు నా కూతుళ్లకు టెస్ట్ చేసిన ప్రతీ సారి నెగిటివ్ వచ్చిందనే విషయం హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను. కానీ మా ఇంట్లో పనిచేసే ముగ్గురికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా కోలుకున్నారని తెలియజేయటం సంతోషంగా ఉంది. మేం కూడా 14 రోజలు క్వారెంటైన్ కాలాన్ని పూర్తి చేసుకున్నాం. కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నాం. కరోనా సోకిన వారు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం'' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని కోరారు. అందరం కలిసి వైరస్ పై పోరాడాలని.. కరోనాపై పోరులో విధుల్లో అంకిత భావంతో పనిచేసే పోలీసులకు డాక్టర్లు నర్సులు ఇతర పారిశుధ్ధ కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేసారు.