గత కొంతకాలంగా బెబో కరీనా కపూర్ఖాన్ ఓవైపు సినిమాలు, మరోవైపు వారసుడు తైమూర్ అలీఖాన్ తో సమయం స్పెండ్ చేయడం.. రెండిటినీ ఎంతో బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఇంతలోనే పటౌడీ ఫ్యామిలీలోకి మరో కొత్త బుడతడు వస్తున్నాడా? బెబో కరీనా గర్భిణినా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా కరీనా బేబి బంప్ ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ ఫోటోలు చూడగానే కరీనా గర్భం దాల్చింది అంటూ అభిమానులు కంగారు పడ్డారు.
అయితే అది నిజగర్భం కాదని తెలుస్తోంది. ఆ బేబి బంప్ కేవలం సినిమా కోసం. అందులో ఆ పాత్రధారి బేబి బంప్ తో కనబడాల్సి ఉంటుంది. రాజ్మెహతా చిత్రం `గుడ్ న్యూస్`లో ఈ భామ నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. కరీనా తన పాత్ర చిత్రణకు తగ్గట్టే ఆహార్యాన్ని కనబరుస్తున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఆ లూజ్ డ్రెస్.. ట్రాక్ సూట్ లో బేబి బంప్ రియలిస్టిక్ గా కనిపించడం హైలైట్.
ఇక ఇటీవలే నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా గర్భిణి అంటూ ప్రచారం సాగింది. `కాఫీ విత్ కరణ్` షోలో ఇదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్ ముందు పీసీ నవ్వేస్తూ ఆన్సర్ ఇచ్చింది. ఇంతకీ `గుడ్ న్యూస్` సినిమా కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇది అద్దె గర్భం (సరోగసి) నేపథ్యంలో సినిమా అని తెలుస్తోంది. అక్షయ్ - కరీనా మధ్య అనుబంధం అద్దె గర్భానికి సంబంధించి. ఆ పాత్రలకు కియరా అద్వాణీ, దిల్జీత్ సాయపడే పాత్రల్లో నటించారట. గబ్బర్ ఈజ్ బ్యాక్, అజ్నబీ, ఐత్ రాజ్ చిత్రాల్లో కిలాడీ అక్షయ్ సరసన కరీనా నటించిన సంగతి తెలిసిందే.