తమిళ మిల్కీ మిలమిలలు చూశారా

Update: 2016-02-27 04:30 GMT
అర్జంటుగా అందరి దృష్టిలో పడిపోవాలన్నా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోవాలన్నా.. హీరోయిన్లకు ఉన్నది ఒకటే మార్గం. అదే స్కిన్ షో. ఈ మధ్య స్కిన్ షో ఓల్డ్ ఫ్యాషన్ ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఓ అడుగు ముందుకేసి క్లీవేజ్ ని పబ్లిక్ లో ఎక్స్ పోజ్ చేస్తూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు భామలు.

ఫిలింఫేర్‌ లో క్లీవేజ్ షో పెట్టి కాజల్‌ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ఇప్పుడు రచ్చ భామ తమన్నా కూడా ఇలాగే రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నాగార్జున - కార్తీలతో కలిసి తమన్నా చేసిన మూవీ ఊపిరి. ఈ మూవీ తమిళ వెర్షన్‌ తోఝా ఆడియో లాంఛ్ కు మిల్కీ బ్యూటీ వచ్చిన చూసి, అందరూ గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. రెడ్ కలర్ డ్రస్ లో.. ఉండీ లేనట్లుగా ఉన్న స్ట్రాప్స్ తో పై భాగమంతా ప్రదర్శిస్తూ.. డీప్ క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తూ.. తళతళా మెరిసిపోయింది తమ్మూ. ఫంక్షన్ కి వచ్చిన జనాలకు స్టేజ్ పై ఈ తెల్లతోలు భామ ఉన్నంత వరకూ.. ఈమెను చూడ్డమే సరిపోయింది.

పనిలో పనిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని కూడా తెగ పొగిడేసింది. సూర్య తనకు లక్కీ హీరో అని.. గతంలో తన మూవీ బాహుబలి ఆడియో ఫంక్షన్ కి సూర్య వస్తే.. ఆ సినిమా 600కోట్లు కొల్లగొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంది తమన్నా. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ అవావని కోరుకుంటున్నానంటూ.. పెద్ద కోరికనే బయటపెట్టిందీ మిల్కీ సుందరి.
Tags:    

Similar News