వీడియో: స్టార్ వైఫ్ కిల్ల‌ర్ లుక్ కిల్లింగ్

Update: 2019-02-04 06:46 GMT
జీరో సైజ్ ని క‌నిపెట్టింది ఎవ‌రు? అంటే ప్ర‌తి ప‌దిమందిలో తొమ్మిది మంది బాలీవుడ్ క‌థానాయిక‌ క‌రీనా పేరు చెబుతారు. బెబో క‌రీనాని త‌ల‌వ‌నిదే జీరో సైజ్ గురించి ప్ర‌స్థావించ‌రు. ఈ విష‌యంలో క‌రీనా త‌ర్వాతే ఎవ‌రైనా. సైజ్ జీరో అన్న ప‌దానికి అంత‌టి పాపులారిటీ తెచ్చిన మేటి బాలీవుడ్ నాయిక క‌రీన‌. దాదాపు ద‌శాబ్ధం క్రిత‌మే ఈ ట్రెండ్ ని తెచ్చి యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అయిన ఈ బ్యూటీ .. సైఫ్ ఖాన్ ని పెళ్లాడి ఒక బిడ్డ‌కు త‌ల్లి అయ్యాక కూడా ఫ్యాష‌న్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఓవైపు థైమూర్ అలీఖాన్ వేగంగా ఎదిగి పెద్ద‌వాడైపోతున్నాడు. అయినా ఇప్ప‌టికీ ర్యాంప్ ని షేక్ చేస్తూ నిరంత‌రాయంగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది. బెబో క‌రీనా ప‌టౌడీ కోడ‌లు అయ్యాక కెరీర్ ప‌రంగా ఇంకా ఇంకా స్పీడ్ పెంచుతోందే కానీ, ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

తాజాగా ముంబై లాక్మే ఫ్యాష‌న్ వీక్ లో క‌రీనా హొయ‌లు కుర్ర‌కారు గుండెల్ని ల‌య త‌ప్పేలా చేశాయంటే అతిశ‌యోక్తి కాదు. ఈ అమ్మ‌డు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో స్ట‌న్నింగ్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. వ్వావ్ .. దేవ‌తా సుంద‌రి.. గ్రేట్ క్వీన్! అంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో ఈ వీడియోని, ఫోటోల్ని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ఫ్యాష‌న్ వీక్ గ్రాండ్ ఫైన‌ల్స్ లో క‌రీనా లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. శంత‌ను నిఖిల్ ఈ డిజైన‌ర్ డ్రెస్ ని క‌రీనా కోసం సిద్ధం చేశార‌ట‌.

బెబోకి శంత‌ను రూపొందించిన ఈ డిజైన్ యూత్ లో కిర్రాక్ పుట్టిస్తోంది. ఓ ర‌కంగా క‌రీనా లుక్ ఇండియ‌న్ వెర్ష‌న్ `క్యాట్ ఉమెన్` ని త‌ల‌పించిందంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిష్ఠాత్మ‌క డీసీ కామిక్స్ సూప‌ర్ ఉమెన్ సినిమా తీస్తే బెబో క‌రీనా పేరును ప‌రిశీలించినా త‌ప్పేమీ లేదు. ఫ్యాష‌న్ కి ప‌రాకాష్ట‌గా బెబో బ్లాక్ క‌ల‌ర్ గ్లాసెస్ లోంచి తీక్ష‌ణంగా చూస్తున్న ఆ చూపు మ‌తి చెడ‌గొట్టిందంతే.

Click Here For Video
Tags:    

Similar News