కార్తి- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'సుల్తాన్'. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తమిళనాడు లోని దిండిగల్ ఫోర్ట్ లో జరిగింది. ఈ షూటింగ్ లో కార్తి.. రష్మిక ఇద్దరూ పాల్గొన్నారు. అయితే ఈ షూటింగును కొందరు ఆందోళనకారులు అడ్డుకున్నారట. టిప్పు సుల్తాన్ మహారాజుపై సినిమా తీస్తే మేము ప్రతిఘటిస్తామని.. పైగా సుల్తాన్ పాలించిన ఈ కోటలో షూటింగ్ చేయడానికి మేము ఎంతమాత్రం ఒప్పుకోం అంటూ వారు షూటింగ్ కు అంతరాయం కలిగించారట. దీంతో కార్తి - రష్మిక షూటింగ్ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చిందట.
ఈ విషయంపై అటు కార్తి కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. అయితే నిర్మాతలు మాత్రం ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు "సినిమాలో ఏవి చూపించకూడదో చెప్పేందుకు సెన్సార్ బోర్డ్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే సినిమాలో ఏం చూపించాలనే హక్కు ఫిలిం మేకర్స్ కు ఉంటుంది. ఇది మన దేశం క్రియేటర్లకు ఇచ్చిన స్వేచ్చ. ఆ స్వేచ్చకు భంగం కలిగించే సంస్థ లేక వ్యక్తుల చర్యలను మేము ఖండిస్తున్నాం. జాతీయ నాయకుల పేరిట.. కులం పేరిట.. మతం పేరిట గొప్ప నాయకులకు.. మన చరిత్రకు అపకీర్తి తీసుకొచ్చే వారిని మేము వ్యతిరేకిస్తున్నాం" అంటూ తమ స్పందన తెలిపారు.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు 'సుల్తాన్' అనే పేరు ఎందుకు పెట్టారు.. ఆ టిప్పు సుల్తాన్ కథను నిజంగానే తెరకెక్కిస్తున్నారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈమధ్య మనోభావాలు అందరివీ చాలా సున్నితంగా మారాయి కాబట్టి ఫిలిం మేకర్లకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు తప్పడం లేదు.