ప్రేక్షకులు నన్ను థియేటర్ లో చూడాలనుకుంటున్నారు కనుక నేను నా సినిమాలను థియేటర్ ల్లోనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రయోగాత్మక సినిమాలు పాత్రలు చేసేందుకు ఓటీటీ అయితే మంచిదని కొందరు అంటూ ఉన్నారు. కాని నాకు ఓటీటీపై పెద్దగా ఆసక్తి లేదు. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ కాని సినిమా కాని చేయాలనుకోవడం లేదు. ఖైదీ లాంటి సినిమాలు థియేటర్ ప్రేక్షకులు ఆధరించినప్పుడు ప్రయోగాల కోసం ఓటీటీ వైపు చూడాల్సిన అవసరం ఏంటీ అంటూ కార్తీ అంటున్నాడు. నాకు ప్రేక్షకుల నుండి ప్రయోగాలకు అనుమతి వచ్చింది. కనుక థియేటర్ సినిమాల్లోనే తాను ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లుగా కార్తీ చెప్పుకొచ్చాడు.
కార్తీ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా తమిళంలో రూపొందిన 'సుల్తాన్' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో కార్తీ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో తనకు బాబు పుట్టాడని అతడికి కందన్ అని పేరు పెట్టామని అన్నాడు. కందన్ అంటే దేవుడు అని అర్థం అన్నాడు. మా ఫ్యామిలీలో అందరికి కూడా అలాంటి పేర్లే ఉంటాయి. సాంప్రదాయ బద్దమైన పేర్లకు తాను ఆసక్తి చూపించాను అన్నాడు.
సుల్తాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. కథ 20 నిమిషాల్లో విన్నాను. ఆ వెంటనే నిర్మాతలకు ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పాను. దాదాపు రెండేళ్ల పాటు కథను డెవలప్ చేసి ఆ తర్వాత సినిమా ను మొదలు పెట్టాం. మొదటి సారి రష్మిక పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ సినిమా కోసం ట్రాక్టర్ నడిపింది.. పాలు పితికింది ఇంకా పలు పల్లె పనులు చేసింది. షూటింగ్ సగంకు వచ్చేప్పటికి పల్లూటూరు అమ్మాయిగా ఉండటం చాలా కష్టం బాబో అందట. సినిమాలో రష్మిక పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుందని కార్తీ చెప్పుకొచ్చాడు.