కార్తికేయ వల్లే యుద్ధం శరణం అలా?

Update: 2017-09-10 06:41 GMT
సినిమా పరిశ్రమలో ఏదైనా ఒక ఆవకాశం దొరకాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ కొంత మందికి అల్ రెడీ సినీ పరిశ్రమతో సంబంధాలు ఉంటే వారు ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా ఈజి అవుతుంది. ఇదే తరహాలో యుద్ధం శరణం అనే సినిమా దర్శకుడికి అదృష్టం కలిసొచ్చింది కానీ అతను తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు.

మంచి హిట్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న నాగ చైతన్య కూడా ఈ సినిమాతో మళ్ళీ డౌన్ అయ్యాడు. కేవలం కృష్ణ మరిముత్తు ఒక ఫ్రెండ్ అనే నమ్మకంతో చైతు అవకాశం ఇచ్చాడు. అయితే ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటిని తీసుకొచ్చింది మాత్రం చైతు కాదట. రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమా తెరకెక్కడానికి కారణమట. ఎందుకంటే.. చైతు - కార్తికేయ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే రాజమౌళి కుటుంబానికి ఆత్మ బంధువైన సాయి కొర్రపాటి సాయంతో తనే లైన్ ప్రొడ్యూసర్ గా ఉండి చైతు - కృష్ణ లతో "యుద్ధం శరణం" సినిమాను పట్టాలెక్కించాడు.

అంతే కాకుండా సినిమాలోని కొన్ని సీన్స్ లో కార్తికేయ ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే చివరిగా సినిమా అయిపోయిన తర్వాత నాగార్జున స్క్రిన్ ప్లే విషయంలో కాస్త నిరాశచెందారట. ఇక రాజమౌళి కూడా విడుదలకు ముందే సినిమా చూసి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. సాధారణంగా ఏ సినిమా చూసినా జక్కన్న సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటాడు సో యుద్ధం శరణం రిజల్ట్ ను ఆయన  కూడా ముందుగానే ఉహించేశారు.


Tags:    

Similar News