రజినీపై సెటైర్ వేసిన మాజీ హీరోయిన్

Update: 2017-05-20 14:53 GMT
మాజీ హీరోయిన్ కస్తూరి కొన్నాళ్ల క్రితం ఓ స్టార్ హీరోపై వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది. ఆ హీరో పేరు చెప్పకపోయినా.. తనను లైంగికంగా కోరుకున్నాడంటూ చెప్పిన భామ.. కొన్ని క్లూస్ కూడా ఇచ్చింది. వాటి ప్రకారం జనాలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు కూడా. అలాంటి కస్తూరి ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో సంచనలం సృష్టించింది.

ఈ సారి ఏకంగా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పైనా.. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపైనా మాట్లాడేసింది కస్తూరి. అయితే.. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా జాగ్రత్తపడ్డ కస్తూరి రజినీ పేరు మాత్రం ఎత్తలేదు. 'దశాబ్దాల తరబడి తనకు తాను సొంతగా నిర్ణయం తీసుకోలేకపోతున్న ఓ వ్యక్తి.. నిర్ణయాత్మక నాయకుడు ఎలా అవుతాడు' అంటూ ట్విట్టర్ సాక్షిగా ప్రశ్నను సంధించింది. సరైన రాజకీయ నాయకుడు అంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండాలని అంటోంది కస్తూరి. అసలు రాజకీయాల్లోకి రావాలో లేదో నిర్ణయించుకోలేక పోతున్నపుడు.. సరైన నాయకుడు అవుతారా అన్నది కస్తూరి వెలిబుచ్చిన డౌట్.

దీంతో పాటు #nobattlecriesplease అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను తగిలించింది కస్తూరి. అంటే రజినీకి వ్యతిరేకంగా కామెంట్ చేసిన వెంటనే.. ఆయన ఫ్యాన్స్ నుంచి ఎదురుదాడి మొదలైపోతుందనే విషయం కస్తూరికి తెలుసు. అందుకే ముందుగానే తనపై ఎలాంటి యుద్ధం చేయవద్దని చెప్పి తెలివితేటలు చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News