కాజ్ కోసం టాప్ లెస్ గా ఆ హీరోయిన్

Update: 2015-10-30 06:42 GMT
హీరోయిన్ టాప్ లెస్ అనగానే.. అది సాధారణంగా కుర్రాళ్లను కవ్వించడానికి తీసే ఫొటో షూటే అయ్యుంటుంది. కానీ ఒకప్పటి హీరోయిన్ కస్తూరి మాత్రం ఓ మంచి కాజ్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. మాతృత్వం గొప్పదనాన్ని చాటేందుకు ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్పెషల్ ఎడిషన్ తీసుకురాగా.. దాని కోసం తన సొంత బిడ్డను ఎత్తుకుని టాప్ లెస్ గా పోజులిచ్చింది కస్తూరి. తనే స్వయంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం విశేషం. ‘ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్: ఎ బాడీ ఆఫ్ మదర్స్’ పేరుతో ఈ ఫొటో బుక్ ను తీసుకొచ్చారు.

జేడ్ బీల్ అనే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ దాదాపు 80 మంది మహిళలతో ఫొటోలు తీశాడు. దాదాపుగా అన్నీ న్యూడ్, సెమీ న్యూడ్ ఫొటోలే. ప్రెగ్నెన్సీతో - బిడ్డతో ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. దీని కోసం కస్తూరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి బిడ్డతో కలిసి టాప్ లెస్ గా పోజులిచ్చింది. 90ల్లో హీరోయిన్ గా తమిళ - తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన కస్తూరి.. అమెరికాకు చెందిన రవికుమార్ అనే డాక్టర్ ను పెళ్లాడి సెటిలైంది. ఆమెకు శోభిని - సంకల్ప్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈ మధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది కస్తూరి. ఓ మంచి పని కోసం ఇలా బోల్డ్ గా కనిపించిన కస్తూరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Tags:    

Similar News