కాటమరాయుడా.. ఈ దోబూచులాట ఎందుకు?

Update: 2017-02-04 05:50 GMT
ఈ రోజుల్లో రీమేక్ అనగానే ఆసక్తి పోతోంది. వెంటనే గూగుల్లో కొట్టి ఆ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నారు. భాష ఏదైనా సబ్ టైటిల్స్ పెట్టుకునైనా సినిమా చూసేస్తున్నారు. అలాగని ఒక సినిమా రీమేక్ అన్న సంగతి దాచి పెట్టడమూ కష్టమే. అందుకే దర్శక నిర్మాతలు ముందే విషయం వెల్లడించేస్తున్నారు. ఐతే ‘కాటమరాయుడు’ టీం మాత్రం అలా చేయట్లేదు.

ఈ చిత్రం తమిళ హిట్ మూవీ ‘వీరమ్’కు రీమేక్ అన్న సంగతి ఆల్రెడీ కన్ఫమ్ అయింది. కానీ ఆ సంగతి యూనిట్ సభ్యులు ఒప్పుకోవట్లేదు. మీడియాలో ఎక్కడైనా ఇది ‘వీరమ్’కు రీమేక్ అని వస్తే.. ఖండిస్తున్నారు. కానీ ఈ సినిమాలో పవన్ అవతారం చూసినా.. వివిధ పాత్రల గురించి బయటికి వస్తున్న సమాచారం చూసినా.. దీపావళికి రిలీజ్ చేసిన పవన్-శ్రుతిల పోస్టర్ చూసినా.. ఇది ‘వీరమ్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిపోతోంది.

కానీ ‘కాటమరాయుడు’ టీం మాత్రం ఎక్కడా ఇది ‘వీరమ్’కు రీమేక్ అని చెప్పట్లేదు. ఎవరైనా అన్నా ఒప్పుకోవట్లేదు. మరి ఈ దోబూచులాట ఎందుకో అర్థం కావడం లేదు. బహుశా ‘వీరమ్’ సినిమా తెలుగులోకి ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయి థియేటర్లలో ఆడేయడం.. టీవీల్లో కూడా వచ్చేయడం వల్ల ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమాను రీమేక్ చేయడమేంటి అన్న ప్రశ్న తలెత్తుతుందేమో అని వెనకడుగు వేస్తున్నారేమో. ఐతే వీళ్లెంత దోబోచులాడినా.. రేప్పొద్దున సినిమా విడుదలయ్యాక అసలు సంగతి బయటపడక మానదు. అప్పుడేం చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News