కథలో రాజకుమారి.. కొత్త ట్విస్టు చూశారా?

Update: 2017-03-29 08:44 GMT
నెలన్నర కిందట రిలీజైన ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ అప్పట్లో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా నిలిచింది. నెవర్ బిఫోర్ లుక్ లో దర్శనమిచ్చిన నారా రోహిత్.. జనాల దృష్టిని బాగా ఆకర్షించాడు. ఇప్పుడు ‘కథలో రాజకుమారి’ టీం కొత్త ట్విస్టు ఇచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాగశౌర్యను సరికొత్తగా ప్రెజెంట్ చేసింది. నారా రోహిత్ ఫస్ట్ లుక్ ను ఎంత భిన్నంగా ప్రెజెంట్ చేశారో.. శౌర్య లుక్ విషయంలోనూ ఇంకో కొత్త అనుభూతిని పంచారు.

ముందు ఓ అందమైన సీనరీ చూపించి.. ఆ తర్వాత ఫిలిం ఫేర్ అవార్డుల వేదికను చూపించి.. అవార్డు అందుకోవడానికి వెళ్తున్న శౌర్యను చూపించారు. అంతలో ఏయ్ అంటూ అమ్మాయి పిలుపు వినిపిస్తే.. నన్నా అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు శౌర్య. నిన్నే అంటుందా అమ్మాయి. ఎవర్నువ్వు అని శౌర్య అడగ్గానే.. ‘కథలో రాజకుమారి’ అనే టైటిల్ పడుతుంది. మోషన్ పోస్టర్ కు కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

‘కథలో రాజకుమారి’ సినీ నేపథ్యంలో సాగే అనే సమాచారం. ఇందులో నాగశౌర్య తన నిజ జీవిత పాత్రలోనే కనిపిస్తాడంటున్నారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందిస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News