నాకేమ‌న్నా జ‌రిగితే వారిదే బాధ్య‌త‌:క‌త్తి మ‌హేష్

Update: 2018-07-05 16:43 GMT
శ్రీరాముడిపై ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో సినీ న‌టుడు నాగబాబు స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఏ మ‌తాన్ని  ఎవ‌రు కించపరిచేలా మాట్లాడినా తప్పేనని - హిందువులు ఆరాధించే చరిత్ర రామాయ‌ణం అని నాగ‌బాబు అన్నారు. నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారని, మత విశ్వాసాలు కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు.  హిందువుల మనోభావాల్ని కించపరిచేలా వ్యాఖ్యానించే వారిపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేదంటే చారిత్రక తప్పిద‌మ‌వుతుందని నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై క‌త్తి మ‌హేష్ స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు స‌మాధాన‌మిస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాగ‌బాబు, మెగా ఫ్యామిలీపై అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

``నా పేరు కూడా ఉచ్చ‌రించకుండా న‌న్ను నీచుడిగా సంబోధిస్తూ నాగ‌బాబుగారు చేసిన వీడియో చూసిన త‌ర్వాత ఆయ‌న మీద నాకు అపార‌మైన‌ జాలి క‌లిగింది. అందుకే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. నేనా నీచుడిని....అంత నీచానికి ఏం పాల్ప‌డ్డాను నేను.....ఒక అన్న‌కు తమ్ముడిగా...ఒక త‌మ్ముడికి అన్న‌గా ..ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నా గురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భ‌క్తులు. రాముడి ఆద‌ర్శాల‌ను ఫాలో అవుతోన్న‌భ‌క్ఉత‌లు. జ‌నాల‌ను మోసం చేయ‌డం...ప్యాకేజీలు దండుకోవ‌డం.....ఉన్న పార్టీని అమ్ముకొని వేరే పార్టీలో క‌ల‌వ‌డం...జ‌బ‌ర్ధ‌స్త్ షోల‌లో జ‌డ్జిగా పిచ్చి న‌వ్వులు న‌వ్వ‌డం...ఇటువంటి ప‌నుల‌తో మీరు స‌మాజాన్ని ఉద్ధ‌రిస్తున్నారు. రాముడి ఆద‌ర్శాల‌ను మీ ఫ్యామిలీ ఫాలో అవుతుంద‌ని బాగా తెలుసు. సాధార‌ణంగా నేను వ్య‌క్తిగతంగా ఎవ‌రినీ విమ‌ర్శించ‌ను. కానీ, త‌ప్ప‌ని పరిస్థితుల్లో స్పందిస్తున్నారు. ఎంత కులాహంకారం ఉంటే ద‌ళితుడినైన న‌న్ను నీచుడ‌ని సంబోధిస్తారు. మీరు అలా మాట్లాడారు కాబ‌ట్టి నేను ఘాటుగా స్పందిచడంలో త‌ప్పు లేదు. సెక్యుల‌ర్ హిందువులు ఎక్క‌డ నుంచి వ‌చ్చారండీ? ద‌ళితుల మీద దాడులు జ‌రిగిన‌పుడు మీ నోళ్లు ఏమైపోయాయి.....ముస్లింల మీద దాడి జ‌రిగిన‌పుడు మీరు మోదీ భ‌జ‌న చేస్తున్నారా? లేక ప‌రిపూర్ణానంద భ‌జ‌న చేస్తున్నారా? మీ ఫ్యామిలీ గురించి...మీ అన్న‌ద‌మ్ముల గురించి నేను మ‌ళ్లీ మాట్లాడ‌డం మొద‌లుపెడితే మీరు త‌ట్టుకోవ‌డం క‌ష్టం.జాగ్ర‌త్త‌గా ఉండండి. నాకు బెదిరింపులు ఇస్తారా...ఏంచేస్తారు మీరు న‌న్ను...నేను చావ‌డానికి సిద్ధంగా ఉన్నాను...నాకేమైనా జ‌రిగితే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ, ప‌రిపూర్ణానంద స్వామి, మీరు బాధ్యుల‌వుతారు.నా వాక్ స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను. మీ మాట‌లు చేత‌లు స‌క్ర‌మంగా ఉంటే మీ జోలికి ఎవ‌రూ రారు...నా జోలికి మీరు రాన‌వ‌స‌రం లేదు. నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోకుండా అజ్ఞానంలో కొట్టుకుంటోన్న‌ మీరు...నాకు వార్నింగ్ ఇస్తారా...నన్ను నీచుడంటారా...?ఇదే పంథా మీరు కొన‌సాగించండి....మీ రాజ‌కీయ జీవితం...మీ సినిమా జీవితం...ఎంత దగుల్బాజీ...దౌర్భాగ్య‌మో ...అంద‌రికీ ఎలుగెత్తి చాటే రోజొస్తుంద‌ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాట‌ల ద్వారా మీ సామాజిక ప‌త‌నానికి మీరే పునాది త‌వ్వుకుంటున్నార‌ని మీరు గుర్తించే రోజు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. మీరు హ‌ద్దుల్లో ఉంటే మ‌రింత బెట‌ర్ అని నేను కోరుకుంటున్నాను.`` అని క‌త్తి మ‌హేష్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Tags:    

Similar News