బేసిక్ పోజు కాదు పాపా.. బద్దలయ్యే పోజు

Update: 2017-11-25 04:49 GMT
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ లో మాంచి జోష్ కనిపిస్తోంది. ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడడం.. అదే సమయంలో రణబీర్ కపూర్ తో బ్రేకప్ వంటి వ్యవహారాల కారణంగా.. అటు ప్రొఫెషనల్ గా.. ఇటు పర్సనల్ గా డిస్టర్బెన్స్ లు ఎదురయ్యాయి. వీటి ప్రభావంతో కాసింత డౌన్ అయిన ఈ భామ.. మళ్లీ కొన్నాళ్లకే బౌన్స్ బ్యాక్ అయింది.

సల్మాన్ ఖాన్ కు కాసింత చేరువ కావడం.. టైగర్ జిందా హై మూవీలో హీరోయిన్ ఆఫర్ రావడం వంటివి.. కేట్ రికవరీ కావడానికి కారణాలు చెప్పచ్చు. ఇప్పుడు టైగర్ జిందా హై రిలీజ్ కూడా దగ్గరకు వచ్చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతూనే.. సోషల్ మీడియా సైడ్ నుంచి కూడా తెగ హల్ చేసేస్తోంది కత్రినా. తాజాగా ఇన్ స్టాలో వేరీ బేసిక్ 'డోర్' పోజ్ అంటూ ఓ పిక్ షేర్ చేసింది కత్రినా కైఫ్. ఇందులో వైట్ టాప్ ధరించి.. టోర్నడ్ డెనిమ్ జీన్స్ షార్ట్ వేసుకుని.. ఓ పాతకాలపు తలుపు ముందు నుంచున్న కేట్ కనిపిస్తుంది.

అందాల ప్రదర్శనలో ఆరితేరిపోయిన వాళ్లు మాత్రమే ఇవ్వగల ఈ అద్భుతమైన పోజ్ కు.. మరీ బేసిక్ పోజ్ అనేయడం.. చాలామందిని తెగ బాధ పెట్టేసింది. ఇది జనాల గుండెలు బద్దలయ్యే పోజ్ అంటున్నారు బ్యూటీ లవర్స్. ఇంతకీ తన కామెంట్ లో డోర్ అనే పదానికి మాత్రం కోట్స్ పెట్టడంలో అర్ధానికి అంతరార్ధం మాత్రం అంతు పట్టడం లేదు. ఇంతకీ కేట్ ఉద్దేశ్యం ప్రకారం ఆ 'డోర్' ఏదంటారు?a
Tags:    

Similar News