మిగతా ఫిలిం ఇండస్ట్రీల తరహా లోనే బాలీవుడ్ లో కూడా ఒక హీరోయిన్ ఎక్కువ కాలం కొనసాగడం అనేది చాలా కష్టం. ఐదేళ్ళు.. మహా అయితే పదేళ్ళు. ఆ తర్వాత కెరీర్ ఉండదు. ఇన్స్టా గ్రామ్ ఒక్కటే మిగులుతుంది. అయితే కొందరు కత్రినా లాంటి ఎవర్ గ్రీన్ బ్యూటీలు మాత్రం ఈ సాధారణమైన ట్రెండుకు అతీతంగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు. కత్రినా ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ భామకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
ముంబైలో బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటో గ్రాఫర్లు కత్రినా ను తమ కెమెరాల్లో బంధించకుండా ఉండరు. తాజాగా మరోసారి అలానే జరిగింది. బాలీవుడ్ లో రోజుకో పార్టీ జరుగుతుంది. వేడుకలు ఎక్కువ. అలానే ఈమధ్య ఒక పార్టీ జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరయ్యారు. కత్రినా కూడా హాజరైంది. ఒక పొట్టి నలుపు రంగు గౌన్ ధరించి అందాల రాణి తరహాలో వయ్యారంగా నడుచుకుంటూ పోయింది. ఆ ఫోటోలే మీరు పైన చూస్తున్నవి. యాక్సెసరీస్ లేకుండా.. మినిమమ్ మేకప్ తో సూటు డిజైన్ లో ఉన్న గౌన్ తో అందరినీ కట్టి పడేసింది. ఇక కత్రినా మొహంలోని ఆ చిరు నవ్వును చూస్తే ఆడజాతిని ద్వేషించే కఠిన హృదయం కూడా కరిగి కత్రినాయిజం ఫాలో కావాల్సిందే.
ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. వరస విజయాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకుడు.