మాజీ ప్రియుణ్ని దేవుడంటోంది

Update: 2015-03-16 17:30 GMT
సల్మాన్‌ ఖాన్‌కు ప్రేమాయణాలు కొత్త కాదు. సంగీతా బిజిలానీతో మొదలుపెట్టి.. తాజాగా రుమేనియా మోడల్‌ వరకు చాలామందితో వ్యవహారం నడిపాడు. కానీ ఏ రిలేషన్‌ కూడా రెండు మూడేళ్లకు మించి కొనసాగింది లేదు. ముందు అతణ్ని ఎంత ప్రేమిస్తారో.. తర్వాత అతణ్ని అంతగా ధ్వేషించి దూరమైపోతుంటారు గర్ల్‌ఫ్రెండ్స్‌. మళ్లీ అతడితో మాట్లాడ్డానికి కూడా వాళ్లు ఇష్టపడరు. ఐతే కత్రినా కైఫ్‌ మాత్రం అందరికీ భిన్నంగా కనిపిస్తోంది. బ్రేకప్‌ టైంలో సల్మాన్‌ పేరెత్తడానికి కూడా భయపడిన కత్రిన ఇప్పుడు మాత్రం సల్మాన్‌ తన పాలిట దేవుడని కీర్తిస్తోంది.

''వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ సల్మాన్‌ నాకెంతో సహాయం చేశాడు. ఆయనే లేకుంటే నా జీవితం ఇంత ఉన్నతంగా ఉండేది కాదు. సల్మాన్‌తో పరిచయం నాకే కాదు, ఎవరికైనా అదృష్టమే. తనవారి క్షేమం కోసం తపించే మనసున్న వ్యక్తి ఆయన. సల్మాన్‌ తల్లిదండ్రులు, అతడి చెల్లెళ్లకు కూడా నేనంటే ఎంతో అభిమానం. అలాంటి వాళ్లను నేనింతవరకూ చూడలేదు'' అంటూ సల్మాన్‌ స్తోత్రం చదివేసింది కత్రినా. ఐతే సల్మాన్‌ అంటే అంతిష్టం ఉన్నపుడు, అతడి ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ అంత మంచి రిలేషన్‌ ఉన్నపుడు.. ఉన్నట్లుండి అతడితో ఎందుకు బ్రేపప్‌ చెప్పేసిందో అర్థం కాని విషయం. కత్రినా సహా అందరూ తమంతట తాము సల్మాన్‌ను వదిలేసి వెళ్లారే తప్ప అతను ఎవరితోనూ విడిపోవడానికి ఇష్టపడలేదని సన్నిహితులు చెబుతుంటారు మరి.

Tags:    

Similar News