తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై బాబు గోగినేని ఒక సుదీర్ఘమైన ఆర్టికల్ ను రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ లో కౌశల్ ఆర్మీ అనేది పెయిడ్ ఆర్మీ - బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా తప్పులు చేశారు, కౌశల్ కు చాలా సహకరించారు అంటూ బిగ్ బాస్ నిర్వాహకులను మరియు కౌశల్ ను టార్గెట్ చేస్తూ బాబు గోగినేని రాసిన ఆర్టికల్ వైరల్ అయ్యింది. ఆ ఆర్టికల్ పై కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఆ విషయమై బాబుపై కౌంటర్ పేల్చేశారు. తాజాగా కౌశల్ కూడా ఆ విషయమై స్పందించాడు.
బాబు గోగినేని ఆర్టికల్ పై కౌశల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాబు గోగినేని ఒక సర్వజ్ఞాని - ఆయనకు ప్రపంచ విషయాలు అన్ని తెలుస్తాయి, కాని నాకు మాత్రం ఫ్యామిలీ - బిజినెస్ మరియు బిగ్ బాస్ హౌస్ లో గెలవడం మాత్రమే తెలుసు. ఇతర విషయాల గురించి నాకు అసలు నాలెడ్జ్ లేనే లేదు. ముఖ్యంగా ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు పొందవచ్చు అనే ఒక కాన్సెప్ట్ నాకు తెలియదు. డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చే పాపులారిటీ నాకు అస్సలు వద్దు. డబ్బులిచ్చి కొనుకున్న పాపులారిటీ ఎప్పటికి మనతో ఉండదు. కాని కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ మాత్రం ఎప్పటికి ఉంటుంది.
నేను పడ్డ కష్టం చూసి - ఒంటరిగా ఉండి కూడా పోరాడి నిలిచిన సందర్బాల్లో నన్ను చూసి జనాలు నన్ను అభిమానించారు. అలా ఏర్పాటు అయిన ఆర్మీ కనుక ఇది ఫేక్ ఆర్మీ అస్సలు కాదు అన్నాడు. డబ్బులు ఇస్తే ఎన్నికల్లో ఓట్లు వేస్తారని తెలుసు కాని - ఇలా డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ ఓట్లను కూడా పొందవచ్చు అనే విషయం నాకు తెలియనే తెలియదని కౌశల్ అన్నాడు. అదే సమయంలో నీలిమ కౌశల్ మాట్లాడుతూ డబ్బులిస్తే ఓట్లు వస్తాయేమో కాని ప్రేమ రాదని - యూఎస్ - కెనడా - లండన్ ఇంకా ఎన్నో దేశాల్లో కూడా కౌశల్ ఆర్మీ ఉందని అన్నారు. ఈ వివాదాన్ని బాబు గోగినేని ఇప్పటికైనా నిలిపేస్తే ఆయనకే మర్యాద అంటూ కౌశల్ ఆర్మీ సూచించింది.