ఆకాశం అంచును తాకిన కీర్
ఆకాశం అంచును తాకే హోదాని ఆస్వాధిస్తోంది కీర్తి సురేష్. వరుస విజయాలతో దక్కిన కీర్తి ప్రతిష్ఠలతో వినువీధుల్లో విహరిస్తోంది. వృత్తిగత - వ్యక్తిగత జీవితంలో ది బెస్ట్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తోంది. నటి మేనక కుమార్తెగా సినీఆరంగేట్రం చేసినా తనకంటూ ఓ శైలి ఉందని నిరూపించింది. కేవలం గ్లామరస్ నాయికగానే కాదు - నటన పరంగా నిరూపించుకునే అవకాశం వస్తే తడాఖా చూపిస్తోంది. ఒకే ఒక్క `మహానటి` చిత్రంతో కీర్తి బ్లూ స్కైని టచ్ చేసింది. ఈ సినిమాలో సావిత్రిగా నటించి అంత గొప్ప అభినయ నేత్రిగా పేరు సంపాదించింది. సావిత్రిలా ఒకే ఒక్క కంటి నుంచే నీటి బొట్టు రాల్చిన ఏకైక నవతరం నటి అన్న పేరు తెచ్చుకుంది.
అందుకే ఆకాశం అంచును తాకి - చుక్కల్ని కోసుకుంటోంది ఈ ఫోటోలో కీర్తి. కేవలం ఐడెంటిటీ పరంగానే కాదు.. తనకు వచ్చే పారితోషికంలోనూ చుక్కల్లోనే ఉంది ఈ భామ.అలా ఆర్జించిన మొత్తం ఏం చేస్తోంది? అంటే.. చెన్నయ్ - బెంగళూరు ఔట్ స్కర్ట్స్‌లో - సిటీ సర్కిల్స్ లో అద్భుతమైన విల్లాలు కొనుక్కుంటోందిట. అయితే ఇది ఎక్కడ దిగిన ఫోటోనో కానీ - ఆకాశహార్మ్యంలో అంతెత్తు నుంచి ఫోటో దిగి దానిని సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ గా పెట్టింది. ఈ ఫోటోని వీక్షించిన అభిమానులు షాక్ తో కూడుకున్న సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. కీర్తి ఆకాశం అంచును తాకి - అంతకుమించి ఎదుగుతోంది! అనడానికి ఇదే సింబాలిజం అనుకోవాలా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కీర్తి సురేష్ నటించిన `సామి 2` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈలోగానే మరో క్రేజీ చిత్రం `పందెంకోడి 2` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో విశాల్ సరసన ఓ సాధాసీదా యువతిగా నటించింది. అలానే విజయ్-మురుగదాస్ కాంబినేషన్ మూవీ `సర్కార్`లోనూ కీర్తి అద్భుతమైన పాత్రలో నటించింది. నవంబర్ 6న ఈ సినిమా రిలీజవుతోంది. పందెంకోడి 2 - సర్కార్ చిత్రాలతో కీర్తి ఘనకీర్తి ఇంకా ఇంకా స్కైలోకి వెళుతుందనే అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక అక్కడి నుంచి దిగుతుందో లేదో?