తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి'గా స్థిరపడిపోయింది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి ఫస్ట్ సినిమాతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అలనాటి నటి సావిత్రి బయోపిక్ 'మహానటి' తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో కీర్తి కనబరిచిన అద్భుతమైన నటనకు గాను 'జాతీయ ఉత్తమ నటి' అవార్డు వరించింది. అప్పటి నుంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది కీర్తి. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలని ఓకే చేస్తున్న కీర్తి సురేష్.. స్క్రిప్ట్ విషయంలో మాత్రం సరిగా జడ్జ్ చేయలేకపోతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి.. 'మహానటి' తరువాత మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. వాటిలో 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల కాగా 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో 'పెంగ్విన్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మిస్ ఇండియా' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఈ రెండు సినిమాలలో కీర్తి యాక్టింగ్ బాగున్నప్పటికీ.. ఆమె ఇలాంటి స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకుందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పుడు ఓటీటీలో రిలీజైన రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ కీర్తి కెరీర్ కు మరియు సదరు ఓటీటీకి నష్టం కలిగించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కీర్తి క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి ఆమె వద్దకు వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ని ఆలోచించకుండా సెలెక్ట్ చేసుకుంటోందని.. ఇలానే కొనసాగితే కెరీర్ కి ఇబ్బందులు తప్పవని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. 'మహానటి' తో వచ్చిన ఇమేజ్ నిలబడాలంటే ఇప్పటి నుంచైనా స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆచితూచి అడుగులు వేస్తే సూచిస్తున్నారు. కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుడ్ లక్ సఖి' ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం రజినీకాంత్ 'అన్నాతే'.. మోహన్ లాల్ 'మరక్కార్ అరబికదలింటే సింహం'.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.. నితిన్ 'రంగ్ దే' సినిమాలలో నటిస్తోంది.